“స్త్రీని దేవతలా ఆరాధించాలని చెప్పే హిందూధర్మం నచ్చదు కానీ…పెళ్ళానికి కూతురికి తేడా చూపకుండా ఇలా సమప్రేమ చూపే సంస్కృతి బాగా నచ్చుతుంది…ఈ హాసన్ లాంటివాళ్లకు…కన్న కూతురితో లిప్ కిస్ ఏంట్రా …మళ్ళీ వీడు మన హిందూ మతం మీద పడి ఏడుస్తునే ఉంటాడు” అంటూ సినీ నటుడు కమల్ హాసన్ తన కూతురు, నటి శృతిహాసన్ పెదవులపై ముద్దు పెట్టుకుంటున్నట్లు చూపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: సినీ నటుడు కమల్ హాసన్ తన కూతురు, నటి శృతిహాసన్ పెదవులపై ముద్దు పెట్టినట్లు చూపిస్తున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటో ఫేక్. ఈ వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ ఫోటో Google AI ఉపయోగించి రూపొందించబడిందని Google SynthID నిర్ధారించింది. అలాగే Hive, AI or Not వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా ఈ ఫోటో AI ఉపయోగించి సృష్టించబడిందని నిర్ధారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ ఫోటోలకు సంబంధించిన వివరాల కోసం, మొదటి ఫోటోను గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటో ఇటీవల సెప్టెంబర్ 2025లో జరిగిన SIIMA 2025 ఫిల్మ్ అవార్డ్స్‌కు సంబంధించినదని చెబుతూ పలువురు ఇటీవల షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
అలాగే, రెండోవ ఫోటోను మనం జాగ్రతగా పరిశీలిస్తే, ఈ ఫోటోలో కుడివైపు క్రింద భాగంలో “Google Gemini” కి సంబంధించిన వాటర్‌మార్క్ ఉండటం మనం చూడవచ్చు. ఈ వైరల్ ఫోటో గూగుల్ యొక్క ‘Gemini AI’ ఉపయోగించి సృష్టించబడిందని ఈ వాటర్‌మార్క్ సూచిస్తుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
తదుపరి, గూగుల్ AI మోడల్స్ ఉపయోగించి రూపొందించబడిన దృశ్యాలను గుర్తించే గూగుల్ వారి ‘సింథ్ ID (synthID)’ టూల్ ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ ఫోటో గూగుల్ AIని ఉపయోగించి సృష్టించబడినట్లు స్పష్టమైంది.
Hive, AI or Not వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా ఈ వైరల్ ఫోటో AI ద్వారా సృష్టించబడిందని నిర్ధారించాయి. దీన్ని బట్టి ఈ వైరల్ ఫోటో ఫేక్, AI జనరేటెడ్ అని మనం నిర్థారించవచ్చు.
అంతేకాకుండా, మేము కూడా గూగుల్ యొక్క Gemini AI ద్వారా ఒరిజినల్ ఫోటోను ఉపయోగించి వైరల్ ఫోటో లాంటి ఫోటోను సృష్టించాము. ఆ ఫోటో క్రింద చూడవచ్చు.
చివరగా, సినీ నటుడు కమల్ హాసన్ తన కూతురు శృతిహాసన్ పెదవులపై ముద్దు పెట్టినట్లు చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో ఫేక్. ఈ ఫోటో AI జనరేటెడ్.