Fake News, Telugu
 

వీడియోలో ఉన్నది కిమ్ జాంగ్-ఇల్ (కిమ్ జాంగ్-ఉన్ తండ్రి) మృతదేహం; ప్రస్తుత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్ ది కాదు

0

ఒక మృతదేహాన్ని శవ పేటిక లో పెట్టిన వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్ మరణించాడని చెప్తున్నారు. కానీ, FACTLY విశ్లేషణ లో ఆ వీడియో 2011 లో కిమ్ జాంగ్-ఇల్ చనిపోయినప్పుడు, ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శన కోసం పెట్టినప్పుడు తీసినదని తేలింది. కిమ్ జాంగ్-ఇల్ ఉత్తర కొరియా యొక్క మాజీ అధ్యక్షుడు మరియు ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్-ఉన్ కి తండ్రి. కిమ్ జాంగ్-ఉన్ ఇటీవల జరిగిన తన తాత పుట్టిన రోజు వార్షికోత్సవాలలో కనిపించకపోవడంతో అతను మరణించి ఉంటాడనే వార్తలు మొదలయ్యాయి, కాని దక్షిణ కొరియా అధికారులు కిమ్ జాంగ్-ఉన్ ఆచూకీ తమ ప్రభుత్వానికి తెలుసునని చెప్పారు. అయితే, 30 ఏప్రిల్ 2020 నాటికి, కిమ్ జాంగ్-ఉన్ ఆరోగ్య పరిస్థితి కి సంబంధించి ఎటువంటి కచ్చితమైన సమాచారం లేదు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. ‘AP Archive’ వీడియో – https://www.youtube.com/watch?v=xCBhMIK_KGM
2. న్యూస్ ఆర్టికల్ – https://www.thespec.com/news/world/2011/12/20/nk-leaders-view-kim-jong-il-body.html

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll