గుజరాత్‌లోని సముద్రం దగ్గర శ్రీకృష్ణుడి బంగారు వేణువు లభించిందని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గుజరాత్‌లోని సముద్రం దగ్గర శ్రీకృష్ణుడి బంగారు వేణువు లభించినట్లు చూపిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. సింథ్ ID (synthID), Hive, వంటి AI- జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఈ వైరల్ వీడియోను AI సృష్టించిందని నిర్ధారించాయి. వైరల్ వీడియోలో పేర్కొన్నట్లుగా గుజరాత్‌లోని సముద్రం దగ్గర ఇటువంటి బంగారు వేణువు లభించినట్లు ఎటువంటి ఆధారలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా, వైరల్ వీడియోలో పేర్కొన్నట్లుగా గుజరాత్‌లోని సముద్రం దగ్గర బంగారు వేణువు లభించిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా ఎటువంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు.
ఈ వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, ఇందులో పలు తప్పులు, అసమానతలు స్పష్టంగా కనిపించాయి. వీడియోలో కొంతమంది శరీర భాగాలు పూర్తిగా లేకపోవడం, కొన్ని భాగాలు మాత్రమే అకస్మాత్తుగా కనిపించడం, చేతుల ఆకారాలు సహజంగా లేకపోవడం కూడా మనం గమనించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు ఉంటాయి (ఇక్కడ, ఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.
తదుపరి, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోను 13 డిసెంబర్ 2025న Jangid__monu_2444 ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియోలో ‘veo & Gemini AI’ లోగో వాటర్‌మార్క్‌ను మనం చూడవచ్చు. ఈ వాటర్‌మార్క్ ఈ వైరల్ వీడియోను గూగుల్ వారి ‘Gemini AI’ మోడల్‌ను ఉపయోగించి రూపొందించబడిందని సూచిస్తుంది. Jangid__monu_2444 తరచుగా తన హ్యాండిల్‌లో AI- జనరేటెడ్ వీడియోలను పోస్ట్ చేస్తాడని మేము గమనించాము (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).
సింథ్ ID (synthID), Hive, వంటి AI- జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఈ వైరల్ వీడియోను AI సృష్టించిందని నిర్ధారించాయి.
చివరిగా, గుజరాత్ తీరంలో శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడిబంగారు వేణువు లభించిందంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు.