వరద నీటిలో మొసలి ప్రత్యక్షమైన ఈ వీడియో వడోదరకి సంబంధించింది, హైదరాబాద్ కి కాదు.

హైదరాబాద్ లో వరద నీటిలో ఒక మొసలి ప్రత్యక్షమైందని చెప్తూ దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ వరద నీటిలో ఒక మొసలి ప్రత్యక్షమైంది

ఫాక్ట్(నిజం): పోస్టులో ఉన్న వీడియో 2019లో గుజరాత్ రాష్ట్రం వడోదరలో వరద నీటిలో మొసలి ప్రత్యక్షమైనప్పటిది. ఈ ఘటనకి హైదరాబాద్ కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పోస్టులోని వీడియో లాంటి విజువల్స్ పోలి ఉన్న ఒక 2019 వార్తా కథనానికి సంబంధించిన వీడియో మాకు యూట్యూబ్లో దొరికింది. ఈ వీడియో కింద ఇచ్చిన వివరణ ప్రకారం ఈ వీడియో వడోదరలో వరద నీటిలో ఒక మొసలి ప్రత్యక్షమైన వార్తకి సంబంధించింది.  ఈ ఘటనకు సంబంధించి మరొక వీడియో వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.  దీన్ని బట్టి వరదనీటిలో మొసలి ప్రత్యక్షమైన వీడియో హైదరాబాద్ కి సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఈ ఘటనకి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చదవొచ్చు. ఈ కథనం ప్రకారం ఈ ఘటన గుజరాత్ లోని వడొదరో లో జరిగింది. ఈ మొసలిని NDRF వారు పట్టుకున్నారని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఇటీవల హైదరాబాద్ లో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధంలేని ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ హైదరాబాద్ వర్షాలకు సంబంధించినవి అని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్న సోషల్ మీడియా పోస్టులు చాలా ఉన్నాయి.

చివరగా, వరద నీటిలో మొసలి ప్రత్యక్షమైన వీడియో గుజరాత్ రాష్ట్రం వడొదరకి సంబంధించింది.