Fake News, Telugu
 

బీజేపీ ప్రచార వాహనం మట్టిలో ఇరుక్కుపోయిన ఈ వీడియో ఉత్తరాఖండ్‌కు సంబంధించింది; ఉత్తరప్రదేశ్‌లో తీసింది కాదు

0

ఉత్తరప్రదేశ్‌లో రోడ్డుపై బీజేపీ ప్రచార వాహనం మట్టిలో ఇరుక్కుపోయిన వీడియో అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో రోడ్డుపై బీజేపీ ప్రచార వాహనం మట్టిలో ఇరుక్కుపోయిన వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో ఉత్తరాఖండ్‌లో తీసింది, ఉత్తరప్రదేశ్‌లో కాదు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హరిద్వార్ లక్సర్ ఎమ్మెల్యే సంజయ్ గుప్తా ప్రచార వాహనం రోడ్డుపై ఇరుక్కుపోయినప్పుడు తీసింది ఈ వీడియో. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీడియోలోని వాహనంపై ఉన్న పోస్టర్ చూసినట్లయితే దానిపై లక్సర్ ఎంఎల్ఎ సంజయ్ గుప్తా అని రాసి ఉన్నట్లు చూడొచ్చు. ఈ కీ-వర్డ్స్ ఉపయోగించి, వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న యూట్యూబ్‌ వీడియో లభించింది. ఈ యూట్యూబ్‌ వీడియో టైటిల్, “హరిద్వార్ లక్సర్ ఎమ్మెల్యే సంజయ్ గుప్తా ప్రచార వాహనం ఛిద్రమైన రోడ్డులో ఇరుక్కుపోయింది”. అయితే లక్సర్ ఉత్తరాఖండ్‌లో ఉంది, ఉత్తరప్రదేశ్‌లో కాదు.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, లక్సర్ ఎమ్మెల్యే సంజయ్ గుప్తా ప్రచార వాహనం రోడ్డుపై ఇరుక్కుపోవడంతో, సోషల్ మీడియాలో సరదాగా షేర్ చేస్తున్నట్టు తెలిసింది.

చివరగా, బీజేపీ ప్రచార వాహనం మట్టిలో ఇరుక్కుపోయిన ఈ వీడియో ఉత్తరాఖండ్‌కు సంబంధించింది; ఉత్తరప్రదేశ్‌లో తీసింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll