అయోధ్యలో నూతనంగా నిర్మించబడిన రామ మందిరం దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. 22 జనవరి 2022 నాడు ప్రారంభించనున్న రామ మందిరాన్ని అయోధ్యకు వెళ్లకుండానే సందర్శించండి అంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్యలో కొత్తగా నిర్మించబడిన రామ మందిరం దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): రోహిత్ శుక్లా అనే డిజైనర్ రూపొంధించిన అయోధ్య రామ మందిరం 3D వీడియోని ఈ పోస్టులో షేర్ చేశారు. శివాజీ హోమ్ డిజైన్ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోని 2021 నవంబర్ నెలలో పబ్లిష్ చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్నది అయోధ్యలోని నిర్మించిన అసలు రామ మందిరం కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని శివాజీ హోమ్ డిజైన్ అనే యూట్యూబ్ ఛానెల్ 03 నవంబర్ 2023 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అయోధ్య రామ మందిరం యొక్క 3D యానిమేషన్ వీడియో అంటూ ఈ వీడియోని షేర్ చేస్తూ తెలిపారు. రోహిత్ శుక్లా అనే డిజైనర్ ఈ అయోధ్య రామ మందిరం 3D వీడియోని రూపొందించారని ఈ వీడియో వివరణలో తెలిపారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర వారు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి 2022 ఫిబ్రవరి నెలలో ఒక 3D వీడియోని ట్వీట్ చేసారు. అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు ఇటీవల విడుదల చేసిన చిత్రాలని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని 22 జనవరి 2024 నాడు ప్రారంభిస్తున్నట్టు రామ్ మందిర్ ట్రస్ట్ అధికారులు ప్రకటించారు. అయితే, మొత్తం దేవాలయం పనులు పూర్తి కావడానికి మరో రెండేళ్ళు పట్టవచ్చని అధికారులు స్పష్టం చేశారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నది అయోధ్యలోని నిజమైన రామ మందిరం కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ఈ వీడియోలో కనిపిస్తున్నది అయోధ్యలో నూతనంగా నిర్మించబడిన అయోధ్య రామ మందిరం కాదు.