భారతదేశ జెండాని తగలపెడ్తున్న ఈ ఫోటో పాకిస్తాన్ దేశానికి సంబంధించినది

ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పెట్టి, అది భారత దేశ ముస్లింలు CAA ని వ్యతిరేకిస్తూ జాతీయ జెండాని తగలపెడ్తున్న ఫోటో అని దాని గురించి పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశ ముస్లింలు CAA ని వ్యతిరేకిస్తూ భారతదేశ జాతీయ జెండాని తగలపెడ్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): 2015 లో ముల్తాన్‌ (పాకిస్తాన్) లో జరిగిన ఒక నిరసన సందర్భంలో నిరసనకారులు భారతదేశ జాతీయ జెండాని తగలపెట్టినప్పటి ఫోటో అది. కావున, ఫోటో పాతది మరియు పాకిస్తాన్ లో జరిగిన ఘటనకి సంబంధించినది. పోస్టులో చెప్పింది తప్పు.    

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి, ‘Indian flag burnt’ అనే ఫిల్టర్ తో వెతికినప్పుడు, అది ఒక బ్లాగ్ లో లభించింది. ఆ బ్లాగ్ లో ఉన్న సమాచారం ఆధారంగా వెతికినప్పుడు, అదే ఫోటో ‘Associated Press (AP)’ వారి ఇమేజ్ లైబ్రరీ లో లభించింది. అందులో ఆ ఫోటో గురించి ఉన్న సమాచారం ద్వారా, అది 2015 లో ముల్తాన్‌ (పాకిస్తాన్) లో జరిగిన ఒక నిరసన సందర్భంలో నిరసనకారులు భారతదేశ జాతీయ జెండాని తగలపెట్టినప్పటిదని తెలుస్తుంది. 1971 లో భారతదేశ సైనికులు బాంగ్లాదేశ్ ని పాకిస్థాన్ నుండి వేరు చేయడం లో పాల్గొన్నారని ప్రధాని నరేంద్ర మోడీ తెలుపడంతో, కోపంగా వారు ఆ పని చేసినట్లుగా అందులో ఉంది. కావున, ఫోటో పాతది మరియు పాకిస్తాన్ లో జరిగిన ఘటనకి సంబంధించినది. ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం (CAA) కి వ్యతరేకంగా జరుగుతున్న నిరసనలకూ,ఆ ఫొటోకూ ఎటువంటి సంబంధం లేదు.   

చివరగా, ముస్లింలు భారతదేశ జాతీయ జెండాని తగలపెడ్తున్న ఫోటో పాకిస్తాన్ దేశానికి సంబంధించినది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?