ఈ ఫోటో JNUSU నేత అయిషీ ఘోష్ తలకు గాయం అవ్వడం కంటే ముందే తీసిన వీడియోలోనిది

JNUSU నేత అయిషీ ఘోష్ ఉన్న ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి, పదహారు కుట్లు పడ్డాక కూడా తల పై ఒక చిన్న మచ్చ లేకుండా ఉంది కాబట్టి ఘోష్ గాయం నకిలీదని చెప్తున్నారు. పోస్టులో చెప్పినదాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పదహారు కుట్లు పడ్డాక కూడా తల పై ఒక చిన్న మచ్చ లేకుండా అయిషీ ఘోష్. 

ఫాక్ట్ (నిజం): JNUలో జనవరి 5, 2020 రాత్రి చెలరేగిన అల్లర్లలో అయిషీ ఘోష్ తలకి గాయం అయింది. దాంతో ఆమె తలకి కుట్లు వేశారు. కానీ, పోస్టులోని స్క్రీన్ షాట్ ‘TV9 Bharatvarsh’ నవంబర్ 19, 2019 ప్రసారం చేసిన వీడియోలోనిది. కావున పోస్టులో చెప్పింది తప్పు.

JNUలో జనవరి 5, 2020 రాత్రి చెలరేగిన అల్లర్లలో అయిషీ ఘోష్ తలకి గాయం అయిందని, దాంతో  డాక్టర్లు ఆమె తలకి పదహారు కుట్లు వేశారని ‘The Hindu’ వారి కథనం ద్వారా తెలుస్తోంది.

స్క్రీన్ షాట్ లోని క్రింది భాగంలో ఉన్న సమాచారం ప్రకారం, అది JNU యాజమాన్యం వారు తాము పెంచిన ఫీ లోని కొంత శాతాన్ని నవంబర్ 2019 లో తగ్గించినప్పుడు అయిన ప్రసారంలోనిదై ఉండవచ్చని సూచిస్తుంది. కానీ, ఆ న్యూస్ వీడియో గురించి ‘TV9 Bharatvarsh’ అకౌంట్ లలో కీవర్డ్స్ తో వెతికినప్పుడు లభించలేదు. ‘Alt News’ వారి కథనం ద్వారా, వారు ఆ స్క్రీన్ షాట్ కి సంబంధించిన ట్వీట్ ని ‘TV9 Bharatvarsh’ వారు నవంబర్ 19, 2019 న ప్రచురించినట్టు మరియు ఆ న్యూస్ క్లిప్ లో 2:29 దగ్గర స్క్రీన్ షాట్ లోని స్టిల్ ని చూడవచ్చు.

చివరగా, పోస్టులోని స్క్రీన్ షాట్ JNUSU నేత అయిషీ ఘోష్ తలకు గాయం అవ్వడానికంటే ముందే అయిన ప్రసారం చేసిన వీడియోలోనిది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?