నాలుగు కాన్సంట్రిక్ సర్కిల్స్ (కేంద్రీకృత వృత్తాలు) ఉన్న నాలుగు డిజైన్‌ల గ్రాఫిక్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ‘స్టాటిక్ ఇమేజ్’ను జపనీస్ న్యూరాలజీ ప్రొఫెసర్ యమమోటో సృష్టించారు అని, దీన్ని చూసి, ఈ బొమ్మలు తిరుగుతున్న వేగాన్ని బట్టి మనలో ఉన్న మానసిక ఒత్తిడి స్థాయిని కనుక్కోవచ్చు అని క్లెయిమ్ చేస్తూ దీన్ని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: జపనీస్ న్యూరాలజీ ప్రొఫెసర్ యమమోటో సృష్టించిన ఈ ‘స్టాటిక్ ఇమేజ్’ను చూసి మనలోని స్ట్రెస్ లెవెల్స్/మానసిక ఒత్తిడి స్థాయిని కనుక్కోవచ్చు.
ఫ్యాక్ట్(నిజం): ఈ ఆప్టికల్ ఇల్యుషన్‌ను జపనీస్ సైకాలజీ ప్రొఫెసర్ అకియోషి కిటాయోకా తయారు చేశారు. దీనికి, మనుషుల్లో ఉండే మానసిక ఒత్తిడి స్థాయికి ఎలాంటి సంబంధం లేదు అని ఆయన చెప్పారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ ఆప్టికల్ ఇల్యుషన్‌ను (కంటికి బ్రమ కలిగించే చిత్రాలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) జపనీస్ ప్రొఫెసర్ అకియోషి కిటాయోకా తయారు చేశారు అని మాకు తెలిసింది. ఈయన జపాన్‌లోని ఒసాకాలో ఉన్న Ritsumeikan Universityలో సైకాలజీ ప్రొఫెసర్, వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా న్యూరాలజీ కాదు.
ఈయన తయారు చేసే ఆప్టికల్ ఇల్యుషన్‌లు ఆయన యూనివర్సిటీ వెబ్సైటులో ఉన్నాయి(ఇక్కడ కూడా). వైరల్ పోస్టులో ఉన్న గ్రాఫిక్ కూడా ఇందులో ఉంది. కానీ ఈ ఫోటోపైన ఒక వివరణ ద్వారా, ఈ ఆప్టికల్ ఇల్యుషన్‌కు మానసిక ఒత్తిడికి ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 2019లో ఇదే విషయాన్ని కిటాయోకా తన ‘X’ అకౌంట్లో ఒక పోస్ట్ ద్వారా చెప్పారు. ఈ విషయం పైన ప్రొఫెసర్ కిటాయోకా Boom Liveతో మాట్లాడుతూ, తన ఆప్టికల్ ఇల్యుషన్‌లకు stress (మానసిక ఒత్తిడి) managementకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. అలాగే, ఒక ఇల్యుషన్ చూసి మనలోని ఒత్తిడి స్థాయిలని మనం లెక్కించలేము అని ఆయన చెప్పారు.
గతంలో ఉక్రెయిన్‌కి చెందిన డిజైనర్ యూరి పేరేపడియా తయారు చేసిన డిజైన్ ఒకటి ఇదే విధమైన వాదనలతో వైరల్ అయినప్పుడు BBC దీని మీద ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ వాదనల్లో వాస్తవం లేదు అని స్వయానా డిజైనర్ యూరి పేరేపడియా BBCకి చెప్పారు. అలాగే, ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఇది ఫేక్ అని ఆయన చెప్పారు. వైరల్ పోస్టుకి ఈ క్లేయిముకి ఒక యాదృచ్ఛికత ఉంది, యూరి పేరేపడియా తయారు చేసిన డిజైన్, వైరల్ ఆప్టికల్ ఇల్యుషన్‌ను తయారు చేసిన అకియోషి కిటాయోకా యొక్క ఎఫెక్ట్ ఉపయోగించి చేశారు అని అని యూరి పేరేపడియా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో చెప్పారు.
చివరగా, జపనీస్ ప్రొఫెసర్ అకియోషి కిటాయోకా యొక్క ఆప్టికల్ ఇల్యూజన్స్ మానవులలో ఒత్తిడి స్థాయిని గుర్తించవు.