ఫోటోలో ఉన్న వ్యక్తి హిమాలయ కంపెనీ కంపెనీ ఓనర్ కాదు. మహమ్మద్ మనల్ 1986 లోనే మరణించారు

హిమాలయ కంపెనీ ఓనర్ మహమ్మద్ మీనాల్ తన వార్షిక ఆదాయంలో 10% ని ఇస్లామిక్ జిహాద్ సంస్థ కి విరాళంగా ఇస్తున్నాడని చెప్తూ ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిమాలయ కంపెనీ ఓనర్ మహమ్మద్ మీనాల్ తన వార్షిక ఆదాయంలో 10% ని ఇస్లామిక్ జిహాద్ సంస్థ కి విరాళంగా ఇస్తున్నాడు.

ఫాక్ట్ (నిజం): హిమాలయ డ్రగ్ కంపెనీ కి సంబంధించి వస్తున్న వార్తలు నిరాధారమైనవి మరియు తప్పని ఆ సంస్థ తెలిపింది. మరియు పోస్టులోని ఫోటో లో ఉన్నది హిమాలయ కంపెనీ ఓనర్ మహమ్మద్ మనల్ కాదు, ఆయన ఆ కంపెనీ సీఈఓ ఫిలిప్ హేడన్. కావున, పోస్టు లో చెప్పింది తప్పు. 

పోస్టు లో చెప్పిన విషయం గురించి వెతికినప్పుడు, హిమాలయ ఇండియా వారు పెట్టిన ట్వీట్ లభించింది. అందులో వారు తమ కంపెనీ కి సంబంధించి వస్తున్న వార్తలు నిరాధారమైనవి మరియు తప్పని తెలిపారు.

పోస్టు లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది 2016 లో ‘Economic Times’ ప్రచురించిన కథనం లో లభించింది. దాని ద్వారా, ఆ ఫోటో లో ఉన్నది హిమాలయ డ్రగ్ కంపెనీ సీఈఓ ఫిలిప్ హేడన్ అని తెలిసింది.

హిమాలయ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ని ఎం.మనల్ (మహమ్మద్ మనల్) 1930 లో డెహ్రాడున్ లో నెలకొల్పాడు. ఆయన 1986 లో మరణించాడు.

చివరగా, హిమాలయ కంపెనీ పైన వస్తున్న వార్తలు నిరాధారమైనవి మరియు  తప్పని ఆ కంపెనీ తెలిపింది. మరియు ఫోటోలో ఉన్నది ఆ కంపెనీ ఓనర్ కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?