హైదరాబాద్ రోడ్ మీద ఒక బైక్ మ్యాన్ హోల్ లో మునిగింది అని వీడియో లో చూపిస్తున్న సంఘటన బ్రెజిల్ లో జరిగింది

హైదరాబాద్ లో ఒక రోడ్  మీద మ్యాన్ హోల్  తెరిచి ఉండడం వల్ల బైక్  దాంట్లో మునిగిందని ఒక  వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. ఆ  వీడియోలో ఎంత వాస్తవం వుందో కనుక్కుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : హైదరాబాద్ లో ఒక రోడ్ మీద మ్యాన్ హోల్ తెరచి ఉండడం వళ్ల జరిగిన ప్రమాదం వీడియో.

ఫాక్ట్ (నిజం): ఆ బైక్ ప్రమాదం బ్రెజిల్ లోని సావో పాలో నగరంలో, 2015లో జరిగింది. కావున, పోస్ట్ లో క్లెయిమ్ చేసినట్టు ఆ వీడియో లోని ప్రమాదం హైదరాబాద్ లో జరగడం అబద్ధం.

ఆ వీడియో గురించి యూట్యూబ్ లో కొన్ని కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా  అదే వీడియో క్లిప్ తో ‘Motorcycle falls in hole – Brazil’ అనే శీర్షిక తో జనవరి 28, 2015 లో యూట్యూబ్ లో పెట్టిన ఒక వీడియో లభించింది. గూగుల్ లో కూడా ఆ వీడియోకి సంబందించిన కీవర్డ్స్ తో వెతకగా ‘CBS news’ జనవరి 27, 2015లో యూట్యూబ్ లో పెట్టిన ఒక  వీడియో కనిపించింది. ఆ వీడియో కింద వివరణ ప్రకారం ఆ బైక్ ప్రమాదం బ్రెజిల్ లోని సావో పాలో నగరంలో జరిగినట్టుగా తెలుస్తుంది.

గ్లోబల్ న్యూస్ వారు కూడా ఆ బైక్ ప్రమాదం బ్రెజిల్ లోనే జరిగిందని రాసిన కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.

చివరగా, బ్రెజిల్ లో ఒక మోటార్ సైక్లిస్ట్ కి సంబందించిన బైక్ మ్యాన్ హోల్ లో మునిగిన వీడియోని  హైదరాబాద్ లో జరిగిన బైక్ ప్రమాదంగా సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?