పాత వీడియో పెట్టి, ‘CAA మరియు NRC లకు మద్దతుగా హరిద్వార్ లో నాగ సాధువులు రాలీ’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

CAA మరియు NRC లకు మద్దతుగా హరిద్వార్ లో నాగ సాధువులు రాలీ నిర్వహించినట్టు చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: CAA మరియు NRC లకు మద్దతుగా హరిద్వార్ లో నాగ సాధువులు నిర్వహించిన రాలీ వీడియో   

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియోని మార్చి-2019 లోనే యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టుగా చూడవొచ్చు. ఆ వీడియోకీ, తాజాగా CAA మరియు NRC లకు మద్దతుగా నిర్వహిస్తున్న రాలీలకు ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, కొన్ని వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వీడియోని ఒకరు తన ట్విట్టర్ అకౌంట్ లో కుంభ మేళా కి సంబంధించిన వీడియోగా మార్చి-2019 లోనే పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. కొంత మంది ఇదే వీడియోని యూట్యూబ్ లో కూడా మార్చి-2019 లోనే పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. అది కుంభ మేళా కి సంబంధించిన వీడియో అని కచ్చితంగా చెప్పలేము, కానీ తాజాగా CAA మరియు NRC లకు మద్దతుగా నిర్వహించిన రాలీ మాత్రం కాదు

చివరగా, పాత వీడియో పెట్టి, ‘CAA మరియు NRC లకు మద్దతుగా హరిద్వార్ లో నాగ సాధువులు రాలీ’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?