Fake News, Telugu
 

ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం విడుదల చెయ్యనున్న అయన చిత్రంతో ఉన్న వెండి నాణెం ఇది కాదు

0

తెలుగు సినీ నటులు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  దివంగత నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన చిత్రంతో కూడిన వెండి నాణేన్ని విడుదల చేయనున్నట్లు వార్తలు (ఇక్కడ, ఇక్కడ) వచ్చిన సందర్భంగా, ఆ నాణెం యొక్క ఫోటో అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చెచేస్తున్నారు. పోస్టులో ఉన్న ఫోటో ఆ నాణేనిదా కాదా అని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: నందమూరి తారక రామారావు (ఎన్.టీ.ఆర్) శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం విడుదల చేయనున్న వెండి నాణెం యొక్క ఫోటో.

ఫాక్ట్: పోస్టులో ఉన్న నాణెం యొక్క ఫోటో 2013 నుండి ఇంటర్నెట్లో ఉంది. ప్రభుత్వం విడుదల చేయబోబడుతున్న వెండి నాణెం యొక్క ఫోటోలు ఏవి ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాల్లో ప్రచురితమవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

ముందుగా వార్తా కథనాల ప్రకారం, ఎన్.టీ.ఆర్ శతజయంతి సందర్భంగా విడుదల చేయనున్న నాణెం వెండిది, ఆయనకు స్మారకంగా భారత ప్రభుత్వం ఎన్.టీ.ఆర్ బొమ్మే కలిగిన 100 రూపాయల వెండి నాణెం మే 28వ తేదీన విడుదల చేయనున్నది. ఈ నాణేనికి సంబంధించిన ఎటువంటి అధికారిక చిత్రాలు కూడా వార్త కథనాల్లో ప్రచురితమవలేదు. పైగా,ఈ నాణెం యొక్క ఫోటో అని పోస్టులో క్లెయిమ్ చేయబడుతున్న ఫోటోలో ఉన్నది ఒక బంగారు లేదా ఇత్తడి నాణెం వలే ఉంది.

అసలు ఈ  పోస్టులో ఉన్న ఫోటో గురించిన వివరాలు ఏంటో తెలుసుకోవటానికి, సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, nandamurifans.com వెబ్సైటులోని 2013 పోస్టులో ఈ ఫోటో అప్లోడ్ చేసినట్టు తెలిసింది. ఈ నాణెం యొక్క వెనుక భాగం కూడా అందులో ఉంది, దానిపై బసవతారకం కాన్సర్ హాస్పిటల్ యొక్క పేరు కూడా ముద్రించబడి ఉంది. అంతే కాదు, ఇది బంగారు నాణెం అని ఈ ఫోటో కింద ఒక కామెంట్ ఉంది, అమెరికాలోని అట్లాంటాలోనో ఎక్కడో ఈ బంగారు నాణేన్ని విడుదల చేసారు అని కూడా ఆ కామెంట్లో రాసి ఉంది.

దీన్ని ఆధారంగా ఈ నాణెం గూర్చి ఇంటర్నెట్లో మరింత వెతకగా, 2013లో ఎన్.టీ.ఆర్ 90వ జయంతి సందర్భంగా అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో  ఒక బంగారు నాణెం  నందమూరి బాలకృష్ణ విడుదల చేసినట్లు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ). ఈ నాణెం యొక్క వెనుక భాగం, నందమూరి ఫాన్స్ వెబ్సైటులో ఉన్న నాణెం యొక్క వెనుకభాగం రెండు ఓకేలా ఉన్నాయి. ఆ నాణెం విడుదల కార్యక్రమానికి సంబంధించిన వార్త కథనాలు అన్నిటిలో డిజిటల్ ఆర్ట్ రూపంలో ఉన్న నాణెం ఉంది కానీ ఒరిజినల్ నాణెం దొరకలేదు.

నందమూరి ఫాన్స్ వెబ్సైటులో ఏ నాణెం ఫోటో అయితే ఉందో అది, ఈ డిజిటల్ ఆర్ట్ ఒకేలాగా ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ పొందవచ్చు. 

అంతే కాక, ఎన్.టీ.ఆర్ శతజయంతి సందర్భంగా విడుదల చేయనున్న 100 రూపాయల నాణెం వెండిది, వైరల్ ఫొటోలో ఉన్నది బంగారు/ఇత్తడి రంగులో అది. 2017లో కర్నాటిక గాయని ఎం. ఎస్ . సుబ్బలక్ష్మి గారి శతజయంతి సందర్భంగా కూడా, కేంద్రం 100 రూపాయిల వెండి నాణెం విడుదల చేసింది, ఆ నాణెం యొక్క ఫోటోను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, నందమూరి తారక రామారావు 100వ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం  విడుదల చెయ్యనున్న అయన చిత్రంతో ఉన్న వెండి నాణెం ఇది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll