డోనాల్డ్ ట్రంప్ నుదుటి పై తిలకం ఉన్న ఫోటో ఫోటోషాప్ చేయబడినది

డోనాల్డ్ ట్రంప్ నుదుటి పై తిలకం ఉన్న ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి  ‘ఇది ఫొటోషాప్ కాదండోయ్. ఒరిజినల్, అమెరికాలో నవరాత్రులు చేసుకుంటూ ట్రంప్ ఇలా తాను సనాతన రథ ప్రచారకుడిని అని చాటుకున్నాడు’ అంటూ పోస్టు చేస్తున్నారు. అంతేకాకుండా, అందుకు సంబంధించిన ఒక కథనం అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ ని కూడా దానికి జత పరిచారు. ఆ కథనంలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : డోనాల్డ్ ట్రంప్ నుదుటి పై తిలకం పెట్టుకున్నాడు.

ఫాక్ట్ (నిజం): వైట్ హౌస్ వెబ్సైటులో డోనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన అసలు ఫోటోని చూడవచ్చు. ఆ ఫొటోలో ట్రంప్ నుదుటి పై తిలకం కనిపించదు. ఆ ఒరిజినల్ ఫొటోని ఎడిట్ చేసి, ఆయన నుదుటి పైన తిలకాన్ని చేర్చారు. పోస్టు లో పెట్టిన న్యూస్ ఆర్టికల్ లో కూడా ఆ ఫోటో ఫోటోషాప్ చేయబడిందని ఉంటుంది . కానీ, దానిని తప్పుడు వివరణతో పోస్టు చేశారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, దానికి సంబంధించి వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ ద్వారా పోస్టులో పెట్టిన ఆ ఫోటో ఫోటోషాప్ చేయబడిన ఫోటో అని తెలుస్తోంది. అలాంటి ఫోటో ఒకటి ‘వైట్ హౌస్’ వెబ్సైటు లో ట్రంప్ యొక్క ప్రొఫైల్ పిక్చర్ గా ఉండడం చూడవచ్చు. కానీ, ఆ ఫోటలో ట్రంప్ నుదుటి పై తిలకం ఏమీ కనిపించదు. ఆ ఒరిజినల్ ఫొటోని ఫోటోషాప్ చేసి, ఆయన నుదుటి పైన తిలకాన్ని చేర్చారు. కావున, అది ఒక ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్.

పోస్టు లో పెట్టిన న్యూస్ పేపర్ ఆర్టికల్ లో కూడా డోనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన ఆ ఫోటో  ఒక ఫోటోషాప్ చేయబడిన ఇమేజ్ అని ఉంది. కానీ, ఫేస్బుక్ పోస్టులో మాత్రం అది ఫోటోషాప్ ఇమేజ్ కాదని, ఒరిజినల్ ఇమేజ్ అని చెప్తున్నారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

చివరగా, డోనాల్డ్ ట్రంప్ నుదుటి పై తిలకం ఉన్నట్లుగా కనిపించే ఆ ఫోటో ఫోటోషాప్ చేయబడినది. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?