‘How to convert India into Christian Nation’ అనే పుస్తకంతో సోనియా గాంధీ ఉన్న ఈ ఫోటో మార్ఫ్ చేయబడింది

YouTube Poster

సోనియా గాంధీ ఫోటో పెట్టి, దాన్ని జూమ్ చేయగా ‘How to convert India into Christian nation’ అనే పుస్తకం కనబడుతుంది అని, ‘Holy Bible’ మరియు జీసస్ ఫోటో కూడా ఆ ఫోటోలో ఉందని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూదాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: సోనియా గాంధీ ‘How to convert India into Christian nation’ అనే పుస్తకంతో ఉన్న ఫోటో.

ఫాక్ట్: వివిధ న్యూస్ ఆర్టికల్స్, రాహుల్ గాంధీ ట్విట్టర్ పోస్ట్ ద్వారా పోస్ట్ లోని ఇమేజ్ మార్ఫ్ చేయబడ్డట్టు తెలుస్తుంది. ఇమేజ్ ను లెఫ్ట్ లో కొంచెం జూమ్ చేసి చూస్తే ‘@noconversion’ అనే వాటర్ మార్క్ ఉన్నట్టు తెలుస్తుంది. దీని ద్వారా ఆ ఇమేజ్ ను మార్ఫ్ చేసారని అర్ధం చేసుకోవచ్చు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్ట్ లోని ఇమేజ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ మాకు లభించాయి. ఒక న్యూస్ ఆర్టికల్ లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని రైతుల ఆందోళన పై విమర్శిస్తున్నారని ఉంది. ఆ ఆర్టికల్ లో ఉన్న ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ వారు పెట్టిన వీడియో యొక్క స్క్రీన్ షాట్ అని తెలుస్తుంది, కానీ ఇమేజ్ లో ‘How to convert India into Christian nation’ పేరు గల పుస్తకం గానీ, ‘Holy Bible’ గానీ, జీసస్ ఫోటో గానీ లేవు. అదే ఇమేజ్ ను వేరు వేరు సమయాల్లో వేరు వేరు ఆర్టికల్స్ లో వాడారు, అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

న్యూస్ ఆర్టికల్స్ నుండి క్లూ తీసుకొని కాంగ్రెస్ పార్టీ పెట్టిన వీడియో గురించి వెతకగా, రాహుల్ గాంధీ ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఆ వీడియో లభించింది. ఆ వీడియో లోని ఫ్రేమ్స్ మరియు ఇమేజ్ ఒకేలా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ, ఆ వీడియో లో కూడా ఎక్కడా ‘How to convert India into Christian nation’ అనే పుస్తకం గానీ, ‘Holy Bible’ మరియు జీసస్ ఫోటో గానీ లేవు.

పోస్ట్ లోని ఇమేజ్ ను మరియు న్యూస్ ఆర్టికల్స్ లోని ఇమేజ్ ను దగ్గరగా చూసినప్పుడు పోస్ట్ లోని ఇమేజ్ ను మార్ఫ్ చేసినట్టు తెలుస్తుంది.

పోస్ట్ లోని ఇమేజ్ ను లెఫ్ట్ లో కొంచెం జూమ్ చేసి చూస్తే ‘@noconversion’ అనే వాటర్ మార్క్ ఉన్నట్టు తెలుస్తుంది. దీని ద్వారా ఆ ఇమేజ్ ను మార్ఫ్ చేసారని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, మార్ఫ్ చేసిన ఫోటోను షేర్ చేస్తూ సోనియా గాంధీ ‘How to convert India into Christian nation’ పుస్తకంతో ఉన్న ఫోటో అని అంటున్నారు.