మోదీ ఒక మీటింగ్ లో ప్రవేశించగానే ఇమ్రాన్ ఖాన్ తల వంచుకు కూర్చున్నాడని షేర్ చేయబడుతున్న ఫోటో ఫోటోషాప్ చేయబడినది

UNO నిర్వహించిన మీటింగ్ లోకి మోదీ రాగానే అక్కడ ఉన్న దేశాధినేతలందరూ నిల్చొని స్వాగతం చెప్తుంటే ఇమ్రాన్ ఖాన్ మాత్రం  తల వంచుకు కూర్చున్నాడని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది. ఆ పోస్ట్ లో ఎంత నిజం వుందో కనుక్కుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : మోదీ మీటింగ్ లో ప్రవేశించినప్పుడు అందరు నిల్చుంటే, తల వంచుకు కూర్చున్న ఇమ్రాన్ ఖాన్ ఫోటో.

ఫాక్ట్ (నిజం): 2018 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశానికి మోదీ అటెండ్ అయినప్పుడు, అక్కడ దావోస్ లో జరిగిన ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ లో ఆయన టాప్ గ్లోబల్ CEOలను కలిసినప్పుడు తీసిన ఫోటోలో ఉన్న ఒక సభ్యుడి మొఖాన్ని ఎడిట్ చేసి ఇమ్రాన్ ఖాన్ మొఖం పెట్టారు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ టెక్నిక్ ద్వారా సెర్చ్ చేయగా, జనవరి 23, 2018న ‘Financial Express’ ప్రచురించిన ఒక ఆర్టికల్ కనిపించింది. పోస్ట్ లో ఉన్న ఫోటోనే ఆ ఆర్టికల్లో కూడా ఉంది, కానీ ఆ ఫోటో లో ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా లేడు. ఆ ఆర్టికల్ ద్వారా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ లో 2018 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సమావేశానికి వెళ్ళినప్పుడు, అక్కడ దావోస్ లో జరిగిన  ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ లో ఆయన ప్రముఖ గ్లోబల్ CEOలని కలిసినప్పుడు ఈ ఫోటో తీయబడింది అని తెలుస్తుంది. కావున, ఫోటోలో కనిపించేవాళ్ళు పోస్ట్ లో క్లెయిమ్ చేసినట్టు దేశాధినేతలు కాదు, వారు ప్రముఖ గ్లోబల్ కంపెనీల CEOలు . రెండు ఫోటోలని జాగ్రత్తగా గమనిస్తే, ఆర్టికల్ లో వున్న  ఫోటోని ఎడిట్ చేసి పోస్టులో పెట్టారని తెలుస్తుంది. ఫోటోషాప్ ని ఉపయోగించి ఆర్టికల్ లోని ఫోటో లో ఉన్న ఒక సభ్యుడి మొఖాన్ని ఇమ్రాన్ ఖాన్ మొఖంతో రీప్లేస్ చేశారు.

చివరగా, మోదీ మీటింగ్ లోకి ప్రవేశించినప్పుడు ఇమ్రాన్ ఖాన్ తల కిందకు పెట్టుకొని కూర్చున్నాడని ప్రచారం చేస్తున్న ఫోటో ఫోటోషాప్ చేయబడినది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?