అది ఒక ఎడిటెడ్ ‘Howdy Modi’ ఫోటో. ‘PhotoFunia’ అనే ఫోటో ఎఫెక్ట్స్ వెబ్ సైట్ లో తయారుచేసింది

అమెరికాలో ‘Howdy Modi’ ఈవెంట్ సందర్భంగా అమెరికాలోని హౌస్టన్ లో మోడీ మరియు ట్రంప్ యొక్క పోస్టర్లను పెట్టినట్టు ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : అమెరికాలోని హౌస్టన్ లో మోడీ మరియు ట్రంప్ యొక్క‘Howdy Modi’ పోస్టర్లు.

ఫాక్ట్ (నిజం): అది ఒక ఎడిటెడ్ ఫోటో. ‘PhotoFunia’ అనే ఫోటో ఎఫెక్ట్స్ వెబ్ సైట్ లో ఆ ఫోటో ఎఫెక్ట్ ఉన్నట్టు చూడవచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, చాలా ఫోటోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. అన్ని ఫోటోలలో నడుస్తున్న మనుషులు ఒకేలా ఉంటారు కానీ ప్రకటన బోర్డుల మీద పోస్టర్లు మాత్రం మారుతున్నట్టు చూడవచ్చు.

ఇంతకుముందు కూడా “న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ లో ‘Howdy Modi’ పోస్టర్లు” అని ఒక ఫోటో వైరల్ అయినప్పుడు, ఒక ఫోటో ఎఫెక్ట్ వెబ్సైటు లో ఆ ఫోటో ఎడిట్ చేయబడిందని FACTLY విశ్లేషణ లో తేలింది. ఈ ఫోటో కూడా అలానే చేయబడినదా అని వెతకగా, పోస్ట్ లోని ఫోటో కి సంబంధించిన ఫోటో ఎఫెక్ట్ కూడా ‘PhotoFunia’ అనే ఫోటో ఎఫెక్ట్స్ వెబ్ సైట్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

చివరగా, అది ఒక ఎడిటెడ్ ‘Howdy Modi’ ఫోటో. ‘PhotoFunia’ అనే ఫోటో ఎఫెక్ట్స్ వెబ్ సైట్ లో ఆ ఫోటో ఎఫెక్ట్ చూడవచ్చు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?