ఫోటోలో కూలిపోయిన పాకిస్తాన్ ఫైటర్ జెట్ చైనా-పాకిస్తాన్ దేశాలు కలిసి తయారు చేసిన JF-17 ఫైటర్ జెట్ కాదు

చైనా పాకిస్తాన్ దేశాలు కలిసి తయారుచేసిన JF-17 ఫైటర్ జెట్ పాకిస్తాన్ లోని అట్టోక్ నగరంలో కులిపోయిందని క్లెయిమ్ చేస్తూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్:  చైనా పాకిస్తాన్ దేశాలు కలిసి తయారుచేసిన PAF ఫైటర్ జెట్ JF-17 కూలిపోయిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తుంది శోర్కొట్ నగరంలో కూలిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు మిరాజ్ ఫైటర్ జెట్, చైనా-పాకిస్తాన్ దేశాలు కలిసి తయారు చేసిన JF-17 ఫైటర్ జెట్ కాదు. మిరాజ్ ఫైటర్ జెట్లని తయారు చేసేది ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘Dassault Aviation’ కంపెనీ. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే ఫోటోని షేర్ చేస్తూ భారత్ కి చెందిన ‘ANI’ న్యూస్ వెబ్ సైట్ ‘07 ఫిబ్రవరి 2020’ నాడు పబ్లిష్ చేసిన ఒక న్యూస్ రిపోర్ట్ దొరికింది. ఆ రిపోర్టులో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు కి చెందిన ఒక ట్రైనర్ జెట్ ప్రమాదవశాత్తు పాకిస్తాన్ లోని శోర్కొట్ నగరంలో కూలినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అందులో తెలిపారు. ‘ANI’ ట్వీట్ లో మాత్రం కూలిపోయింది మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్ అని తెలిపారు. పోస్టులోని అదే ఫోటోని షేర్ చేస్తూ ‘News Nation’ వెబ్ సైట్ ‘07 ఫిబ్రవరి 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు కి చెందిన మిరాజ్ ఫైటర్ జెట్ శోర్కొట్ నగరంలో కూలినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు.

‘Pakistan Today’ న్యూస్ వెబ్ సైట్ ఈ ఫోటోని షేర్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు కి చెందిన మిరాజ్ ఫైటర్ జెట్ శోర్కొట్ నగరంలో ప్రమాదవశాత్తు కూలినట్టు తెలిపారు. కూలిన జెట్ ని నడిపిన పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని అందులో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ పాకిస్తాన్ ఆర్మీ తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ట్వీట్ ని ఇక్కడ చూడవచ్చు.

ఫోటోలో కూలిపోయి కనిపిస్తుంది JF-17 ఫైటర్ జెట్ కాదు, మిరాజ్ ఫైటర్ జెట్. మిరాజ్ ఫైటర్ జెట్లని తయారు చేసేది ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘Dassault Aviation’ కంపెనీ. ఇటీవల భారత వైమానిక దళంలోకి చేరిన రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేసింది కూడా ఈ సంస్థనే.

చివరగా, పాకిస్తాన్ శోర్కొట్ నగరంలో కూలిపోయిన PAF మిరాజ్ ఫైటర్ జెట్ ని చూపిస్తూ చైనా పాకిస్తాన్ దేశాలు కలిసి తాయారు చేసిన JF-17 ఫైటర్ జెట్ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.