వయాగ్రా టీకాలు వేసిన దోమలు చైనా వుహన్ లాబొరేటరీ నుంచి పారిపోయినట్టుగా షేర్ చేస్తున్నది వ్యంగ్యంగా రాసిన ఆర్టికల్

జన్యువు మార్చబడిన వేల కొద్ది దోమలు చైనా వుహన్ లాబొరేటరీ నుంచి పారిపోయాయని సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఆర్టికల్ స్క్రీన్ షాట్ షేర్ అవుతోంది. వుహన్ ల్యాబ్ నుండి పారిపోయిన ఈ దోమలకి వయాగ్రా టీకాలు వేసినట్టు ఈ ఆర్టికల్ లో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వయాగ్రా టీకాలు వేసిన వేల కొద్ది దోమలు చైనా వుహన్ లాబొరేటరీ నుంచి పారిపోయాయి.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చసిన ఆర్టికల్, ‘World News Daily Report’ అనే సటైరికల్ ఫేక్ వెబ్సైటు పబ్లిష్ చేసింది. చైనా వుహన్ ల్యాబరెటరి నుండి జన్యువు మార్చబడిన దోమలు పారిపోయాయని ఎటువంటి వార్తలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఆర్టికల్ కోసం కొన్ని పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతికితే, ఈ ఆర్టికల్ ని ‘World News Daily Report’ అనే వెబ్సైటు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘World News Daily Report’ అనేది అమెరికాకి చెందిన వెబ్సైటు. వ్యంగ్యంగా రాసిన కల్పిత కథనాలు ప్రచురిస్తామని తమ వెబ్సైటు వివరణలో పేర్కొంది. ‘World News Daily Report’ వెబ్సైటు పేరు కింద ఉన్న ‘Where facts don’t matter’ కాప్షన్ బట్టి కూడా,ఇందులో ప్రచురించిన కథనాలతో నిజం ఉండదని అర్థం చేసుకోవొచ్చు. ఈ వెబ్సైటు లో ప్రచురించిన కథనాలతో ఎటువంటి నిజాలు ఉండవని వెబ్సైటు ఫుటర్ లో కూడా చూడొచ్చు.

పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టుగా చైనా దేశంలోని వూహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబరేటరీ నుండి వయాగ్రా టీకాలు వేసిన దోమలు పారిపోయాయా అని వెతకగా, అలాంటి సంఘటన ఏది వూహన్ ల్యాబరేటరీలో చోటుచేసుకోలేదని తెలిసింది. ఒకవేళ వూహన్ ల్యాబ్ నుండి జన్యువు మార్చబడిన దోమలు పారిపోయి ఉంటే, దానికి సంబంధించిన వివరాలు తెలుపుతూ అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కాని, పోస్టులో తెలుపుతున్న  విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ఎటువంటి న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అవలేదు.

చివరగా, వయాగ్రా టీకాలు వేసిన కొన్ని వేల కొద్ది దోమలు చైనా వుహన్ ల్యాబరేటరీ నుంచి పారిపోయినట్టుగా షేర్ చేస్తున్నది వ్యంగ్యంగా రాసిన ఒక ఆర్టికల్.