Fake News, Telugu
 

ఇది అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం యొక్క ప్రతిపాదిత డిజైన్ కాదు

0

అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం యొక్క ప్రతిపాదిత నిర్మాణ దృశ్యం’ అని చెప్తూ, ఒక బిల్డింగ్ యొక్క 3D -విజువలైజేషన్ ఫోటోని సోషల్ మీడియా లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం యొక్క ప్రతిపాదిత డిజైన్.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని 3D-విజువలైజేషన్ ఫోటో ఇస్కాన్ ప్రధాన కార్యాలయం శ్రీ ధామ్ మాయాపూర్ (పశ్చిమ బెంగాల్) లోని ‘టెంపుల్ ఆఫ్ ది వేదిక్ ప్లానిటోరియం’ భవనానికి సంబంధించినది. అంతేకాదు, బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర (శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు) కూడా అది ఒక ఫేక్ మెసేజ్ అని FACTLY కి తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటో ‘ఇస్కాన్ న్యూస్’ వెబ్సైటులో దొరుకుతుంది. ఫోటోలోని 3డి-విజువలైజేషన్ ఇస్కాన్ ప్రధాన కార్యాలయం శ్రీ ధామ్ మాయాపూర్ (పశ్చిమ బెంగాల్) లోని ‘టెంపుల్ ఆఫ్ ది వేదిక్ ప్లానిటోరియం’ భవనానికి సంబంధించినదని ఆ వెబ్సైటులో చదవొచ్చు.

ఆ భవనానికి సంబంధించిన విజువలైజేషన్ వీడియోని ‘Temple of the Vedic Planetarium – TOVP’ యూట్యూబ్ ఛానల్ లో చూడవొచ్చు. ఆ భవనం యొక్క తాజా విజువలైజేషన్ వీడియోలో బంగారు గోపురాల స్థానంలో నీలి గోపురాలు ఉన్నట్టు చూడవొచ్చు. ఆ భవనం యొక్క నిర్మాణ ఫోటోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

అంతేకాదు, బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర (శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు) కూడా అది ఒక ఫేక్ మెసేజ్ అని FACTLY కి తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం చంద్రకాంత్ సోంపురా రూపొందించిన రామ మందిరం మోడల్ (కొన్ని మార్పులతో) ఆధారంగా అయోధ్య రామ మందిరం రూపకల్పన జరుగుతుందని చాలా వార్తా సంస్థలు తాజాగా రిపోర్ట్ చేసాయి. ఆ న్యూస్ రిపోర్ట్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, పోస్ట్ లోని ఫోటోలో ఉన్నది అయోధ్యలో నిర్మించబోయే రామ మందిరం యొక్క ప్రతిపాదిత డిజైన్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll