మహిళా వేషధారణతో ఉన్న ఈ ఉగ్రవాదులని పట్టుకుంది ఆఫ్గనిస్తాన్ లో, కాశ్మీర్ లో కాదు

మహిళల దుస్తుల్లో ఉన్న వ్యక్తులను కొంతమంది సైనికులు పట్టుకుని ఉన్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘కాశ్మీర్ లో మహిళల దుస్తులు ధరించి తిరుగుతున్న పాకిస్తాన్ టెర్రరిస్టులను పట్టి పాతరేస్తున్న ఇండియన్ ఆర్మీ’ అని చెప్తున్నారు. అయితే, FACTLY విశ్లేషణ లో ఆ ఫోటో అసలు భారత దేశానికి సంబంధించినది కాదని తేలింది. ఆ ఫోటో 2012 లో ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలు మహిళల వేషధారణలో పట్టుబడ్డ తాలిబాన్ ఉగ్రవాదులను మీడియా ముందు హాజరుపరచడానికి తీసుకువెళుతున్నది. కావున, ఫోటో పాతది మరియు భారత దేశానికి సంబంధించినది కాదు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ‘ఏపీ’ ఇమేజెస్ – http://www.apimages.com/metadata/Index/APTOPIX-Afghanistan/76c75109c2f74ecea784e0ec780112cf/1/0
2. ‘డైలీ మెయిల్’ న్యూస్ ఆర్టికల్ – https://www.dailymail.co.uk/news/article-2122130/Chief-army-officer-Afghanistan-orders-guardian-angels-protect-U-S-troops-insider-attacks.html

Did you watch our new video?