Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఉన్నది విరాట్-అనుష్కల కూతురు కాదు

0

విరాట్ కోహ్లికి కూతురు పుట్టిన నేపధ్యంలో కోహ్లి కూతురి ఫొటో పేరుతో కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. కొన్ని ప్రముఖ వార్త సంస్థలు కూడా కొన్ని ఫొటోస్ షేర్ చేసాయి. వీటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: విరాట్ కోహ్లి, అనుష్కల కూతురి ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో ఉన్నది విరాట్- అనుష్కల కూతురు కాదు. ఈ విషయం విరాట్ కోహ్లి సోదరుడు వికాస్ కోహ్లి నిర్ధారించారు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లిగాని లేదా అనుష్క గాని తమ కూతురి ఫోటోలు బయటికి విడుదల చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పబడుతున్న విరాట్ కోహ్లి కూతురి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోని విరాట్ కోహ్లి అన్న వికాస్ కోహ్లి, విరాట్-అనుష్క కి కూతురు పుట్టిందని చెప్తూ ఈ ఫోటో షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టు మాకు కనిపించింది. ఐతే ఈ ఫోటో వైరల్ అయిన నేపధ్యంలో వికాస్ కోహ్లి ఈ ఫోటోలో ఉన్నది విరాట్ కూతురు కాదని మరొక పోస్ట్ ద్వారా స్పష్టం చేసాడు.

పైగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో అచ్చం ఇదే ఫోటో Yahoo వెబ్సైటులోని  ఒక ఆర్టికల్ లో కనిపించింది. ఈ ఆర్టికల్ లో ప్రచిరించిన ఈ ఫోటో కి సంబంధించిన క్రెడిట్స్ ‘Antonio V. Oquias/shutterstock’ అని ఉంది, ఈ క్రెడిట్స్ ఆధారంగా shutterstockలో వెతకగా ఇదే ఫోటో మాకు కనిపించింది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మరికొన్ని ఫొటోస్ కూడా విరాట్ కోహ్లి కూతురివంటూ షేర్ అవుతున్నాయి, వీటిని ఇక్కడ చూడొచ్చు.

ఫోటో 1:

ఐతే పోస్టులోని ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటో ఆగస్ట్ 2017లో World Breastfeeding Week సందర్భంగా రాసిన ఒక వార్తా కథనంలో ప్రచురించారు. ఇదే ఫోటో Getty Images వెబ్సైటులో కూడా చూడొచ్చు. Getty Images లో ఈ పాప కి సంబంధించిన మరొక ఫోటోలో ఆ పాప యొక్క తల్లి ముఖం స్పష్టంగా చూడొచ్చు.

ఫోటో 2:

పోస్టులోని ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటో ప్రచురించిన ఒక 2018 బ్లాగ్ మాకు కనిపించింది, ఈ పాప యొక్క మరికొన్ని ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఈ ఫోటో కూడా విరాట్ -అనుష్కల కూతురిది కాదని చెప్పొచ్చు.

చివరగా, ఈ ఫోటోలో ఉన్నది విరాట్-అనుష్కల కూతురు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll