ఫోటోలో ఉన్న అక్కాచెల్లెల్లు రాజస్తాన్ రాష్ట్రానికి సంబంధించిన సివిల్స్ పరీక్షలో ర్యాంకు సాధించారు, UPSCలో కాదు

రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెల్లకు సివిల్స్ ర్యాంకు (UPSC) వచ్చిందని చెప్తూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, వాళ్ళ తండ్రి మరణించారని, తల్లి కూలీ చేసేదని పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాజస్తాన్ కు చెందిన ఒక కుటుంబం లోని ముగ్గురు అక్కాచెల్లెల్లు భారత సివిల్స్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంకు సాధించారు.

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న అక్కాచెల్లెల్లు రాజస్తాన్ రాష్ట్రానికి సంబంధించిన సివిల్స్ పరీక్ష (‘RAS’ – Rajasthan Administrative Service) లో ర్యాంకు సాధించారు, భారత సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC- Civil Services Examination) లో కాదు. కావున పోస్ట్ లో సివిల్ సర్వీసెస్ (IAS) అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో కూడిన ‘Dainik Jagran’ ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. 2017 లో ప్రచురించిన ఆ ఆర్టికల్ ద్వారా ఫోటోలో ఉన్న అక్కాచెల్లెల్లు రాజస్తాన్ రాష్ట్రానికి సంబంధించిన సివిల్స్ పరీక్ష (‘RAS’ – Rajasthan Administrative Service) లో ర్యాంకు సాధించినట్టు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించిన ఇంకో ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.  రాజస్తాన్ కి సంబంధించిన పరీక్షలో వాళ్ళు ర్యాంకులు సాధిస్తే, భారత సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC- Civil Services Examination) లో రాజస్తాన్ నుండి ముగ్గురు అక్కాచెల్లెల్లు ర్యాంకులు సాధించినట్టు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, ఫోటోలో ఉన్న అక్కాచెల్లెల్లు రాజస్తాన్ రాష్ట్రానికి సంబంధించిన సివిల్స్ పరీక్షలో ర్యాంకు సాధించారు, భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలో కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?