“భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు “చట్టబద్ధంగా” భారత పౌరులు కాదు, 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకు దేశ స్వాతంత్ర్యం మరియు విభజన ప్రకటించబడిన వెంటనే, భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలందరూ పాకిస్తాన్ పౌరులుగా మారారు, భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలకు భారత పౌరసత్వం ఇచ్చేలా నెహ్రూ 08 ఏప్రిల్ 1950 న పాక్ ప్రధాని లియాఖత్ అలీతో “నెహ్రూ లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందం” చేసుకున్నారు , అంటే 08-04-1950 వరకు ముస్లింలు భారత పౌరులు కాదని స్పష్టమవుతుంది, అలాగే ఈ ఒప్పందం తర్వాత ముస్లింలకు భారత ప్రభుత్వం అధికారికంగా పౌరసత్వం మంజూరు చేసినట్లుగానీ లేదా ఏదైనా ఆర్డినెన్స్ ద్వారా ముస్లింలకు సామూహిక పౌరసత్వం/వ్యక్తిగతంగా పౌరసత్వం మంజూరు చేసినట్లు గానీ ఎటువంటి చారిత్రక రికార్డు లేదా రుజువు లేదు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు ‘చట్టబద్ధంగా’ భారత పౌరులు కాదు.
ఫాక్ట్(నిజం): భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు ‘చట్టబద్ధంగా’భారత పౌరులు కాదు అనే వాదనలో నిజం లేదు. భారత పౌరసత్వ చట్టాలు లేదా భారత రాజ్యాంగం ముస్లింలు భారత పౌరులు కాదని, కొన్ని మతాలకు మాత్రమే భారత పౌరసత్వం అర్హత ఉందని ఎక్కడా పేర్కొనలేదు. అలాగే 15 ఆగస్టు 1947న భారత దేశ స్వాతంత్ర్యం, దేశ విభజన ప్రకటించబడిన తరవాత భారతదేశంలో నివసిస్తున్న కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే భారత పౌరసత్వానికి అర్హులని భారత పౌరసత్వ చట్టాలు లేదా భారత రాజ్యాంగం పేర్కొనలేదు. అలాగే 10, 11, 12 ఆగస్టు 1949 తేదీలలో భారత రాజ్యాంగ సభలో జరిగిన భారత పౌరసత్వానికి సంబంధించి చర్చలలో కూడా ఎక్కడ ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వకూడదనే చర్చ జరగలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
భారత రాజ్యాంగంలోని 2వ భాగంలో ఉన్న ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వం గురించి వివరిస్తాయి. భారత రాజ్యాంగం యొక్క తెలుగు వెర్షన్ ఇక్కడ, ఇంగ్లీష్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ఆర్టికల్ 5 :
ఆర్టికల్ 6 :
ఆర్టికల్ 7 :
ఆర్టికల్ 8 :
ఆర్టికల్ 9 :
ఆర్టికల్ 10 :
ఆర్టికల్ 11 :
అలాగే భారతదేశంలో పౌరసత్వ విషయాలను నియంత్రించడానికి భారత పార్లమెంటు పౌరసత్వ చట్టం, 1955ను రూపొందించింది. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి 1986, 1992, 2003, 2005, 2015, మరియు 2019 సంవత్సరాల్లో ఆరుసార్లు సవరించబడింది.
పౌరసత్వ చట్టం, 1955 (The Citizenship Act, 1955):
భారత పార్లమెంటు పౌరసత్వానికి సంబంధించిన సమగ్రమైన నియమాలను నిర్దేశిస్తూ 1955లో భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించింది. 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం 5 రకాల పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు (ఇక్కడ, ఇక్కడ).
Citizenship by Birth –
Citizenship by Descent –
Citizenship by Registration –
Citizenship by Naturalisation –
Citizenship by Incorporation of territory –
ఏదైనా భూభాగం భారతదేశంలో శాశ్వతంగా విలీనం అయితే, ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.
2019లో జరిగిన పౌరసత్వ చట్టం సవరణ (The Citizenship (Amendment) Act, 2019) ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ వర్గాలకు చెందిన వలసదారులు (అక్రమ/సక్రమ) 31 డిసెంబర్ 2014 నాటికి భారతదేశంలో నివాసం ఏర్పరుచుకుంటే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది.
భారత పౌరసత్వ చట్టాలు లేదా భారత రాజ్యాంగం ముస్లింలు భారత పౌరులు కాదని, కొన్ని మతాలకు మాత్రమే భారత పౌరసత్వం అర్హత ఉందని ఎక్కడా పేర్కొనలేదు. అలాగే 15 ఆగస్టు 1947న భారత దేశ స్వాతంత్ర్యం, దేశ విభజన ప్రకటించబడిన తరవాత భారతదేశంలో నివసిస్తున్న కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే భారత పౌరసత్వానికి అర్హులని భారత పౌరసత్వ చట్టాలు లేదా భారత రాజ్యాంగం పేర్కొనలేదు.
అలాగే 10, 11, 12 ఆగస్టు 1949 తేదీలలో భారత రాజ్యాంగ సభలో జరిగిన భారత పౌరసత్వానికి సంబంధించి చర్చలలో కూడా ఎక్కడా ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వకూడదనే చర్చ జరగలేదు. కాకపోతే, ఈ చర్చలో పాల్గొన్న పి. ఎస్. దేశ్‌ముఖ్ హిందూ, సిక్కు మతాలకు చెందిన వారందరికీ భారత పౌరసత్వం ఇవ్వాలని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ సభలో పౌరసత్వానికి సంబంధించి జరిగిన చర్చల యొక్క కాపీలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.
ఇకపోతే వైరల్ పోస్టులు క్లెయిమ్ చేస్తున్న “08 ఏప్రిల్ 1950న జరిగిన “నెహ్రూ లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందం” భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలకు భారత పౌరసత్వం ఇచ్చేలా నెహ్రూ 08 ఏప్రిల్ 1950 న పాక్ ప్రధాని లియాఖత్ అలీతో “నెహ్రూ లియాఖత్ అలీ ఖాన్ ఒప్పందం” చేసుకున్నారు” అనే వాదంలో కూడా ఎలాంటి నిజం లేదు.
నెహ్రూ-లియాఖత్ ఒప్పందం :
విభజన కారణంగా తలెత్తిన శరణార్థుల, మైనారిటీల హక్కులు, వలస వెళ్లిన ప్రజలు వదిలివేసిన ఆస్తుల వంటి పలు సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ 08 ఏప్రిల్ 1950న ఒక ఒప్పదంపై న్యూఢిల్లీలో సంతకం చేశారు. నెహ్రూ-లియాఖత్ ఒప్పందాన్ని ‘ఢిల్లీ ఒప్పందం’ అని కూడా పిలుస్తారు (ఇక్కడ).
రెండు దేశాల్లో మతంతో సంబంధం లేకుండా మైనారిటీలకు పౌరసత్వంపై సమాన హక్కులు ఉంటాయని ఈ ఒప్పందం పేర్కొంది. ఈ ఒప్పదం ప్రకారం, ఇరు దేశాల్లోని మైనారిటీలకు మతాలతో సంబంధం లేకుండా సమాన హక్కులు కల్పించాలి. మైనారిటీల హక్కులను కాపాడటానికి రెండు దేశాల్లోనూ మైనారిటీ కమీషన్లు ఏర్పాటు చేయాలి. మైనారిటీలు ఆయా దేశాల జాతీయ వ్యవహారాల్లో పాలుపంచుకునేందుకు, రాజకీయ పదవులు నిర్వహించేందుకు, పౌర, సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవ చేసేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు. ఈ ఒప్పందం ప్రకారం, రెండు ప్రభుత్వాలు తమ దేశాల్లో ఉన్న మైనారిటీ పౌరుల రక్షణకు పరస్పరం జవాబుదారీగా ఉంటాయి. ఈ ఒప్పందంలో శరణార్థుల తాము కోల్పోయిన ఆస్తులను తిరిగి తీసుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అపహరించిన మహిళలను, దోచుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు. బలవంతపు మతమార్పిడికి గుర్తింపు లేకుండా చేశారు.
చివరగా, భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు ‘చట్టబద్ధంగా’ భారత పౌరులు కాదు అనే వాదనలో నిజం లేదు.