కేరళ స్థానిక ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్‌ అల్లుడిపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ విజయం సాధించారు అనే వాదనలో నిజం లేదు

కేరళలోని 14 జిల్లాల్లో రెండు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కేరళ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నవ్య హరిదాస్ కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నుండి విజయం సాధించారు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో కేరళ CM పినరై కుటుంబాన్ని కుప్ప కూలుస్తా అని శపథం చేసిన నవ్య హరిదాస్ చెప్పినట్టుగా పినరయి విజయన్ మేనల్లుడిని ఓడించి చూపించింది అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చెయ్యబడుతోంది. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. 

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్‌ అల్లుడిపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ విజయం సాధించారు.

ఫాక్ట్ (నిజం):  కేరళ సీఎం పినరయి విజయన్‌ అల్లుడిపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ విజయాన్ని నిర్ధారించే ఆధారాలు లేవు. నవ్య హరిదస్‌తో పాటు కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీజ కనకన్, రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్ధిగా హషితా టీచర్ పోటీ చేశారు. అంతే కాకుండా, ఇది అబద్ధమని, కేరళ ముఖ్యమంత్రి విజయన్ బంధువులను ఏ ఎన్నికలలోనూ ఓడించలేదని నవ్య హరిదాస్‌ స్పష్టం చేసారు. కాబట్టి ఈ పోస్టు ద్వారా చెప్పేది అబద్దం.

ముందుగా, తగిన కీవర్డ్ సెర్చ్ ద్వారా పినరయి విజయన్ అల్లుడిపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ విజయం సాధించిందా అని వెతకగా, మాకు దీన్ని నిర్ధారించే ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేరళ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నవ్య హరిదాస్ కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు నంబర్ 70, కరప్పరంబ్ నుండి విజయం సాధించారు. కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ విజేతల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

కోజికోడ్ వార్డ్ నంబర్ 70, కరప్పరంబ్ నుండి పోటీ చేసిన నవ్య హరిదాస్‌తో పాటు ఇతర అభ్యర్థుల వివరాల కోసం మేము పరిశోధించినప్పుడు, ఆమెతో పాటు కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీజ కనకన్, రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్ధిగా హషితా టీచర్ పోటీ చేశారు అని స్పష్టం అయింది. నవ్య హరిదాస్ సోషల్ మీడియాలో తన ప్రత్యర్థులతో పాటు ఉన్న ఫోటోను ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టు చేసారు. 

తదుపరి, ఈ క్లెయిమ్ వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకునేదుకు ఫ్యాక్ట్లీ నవ్యను సంప్రదించగా, ఆమె ఇది అబద్ధమని, అంతే కాకుండా కేరళ ముఖ్యమంత్రి విజయన్ బంధువులను ఏ ఎన్నికలలోనూ ఓడించలేదని ఆమె స్పష్టం చేసారు. 

చివరిగా, స్థానిక ఎన్నికల్లో కేరళ సీఎం పినరయి విజయన్‌ అల్లుడిపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ విజయం సాధించారు అనే వాదనలో నిజం లేదు.