‘కన్య ధాన్ యోజన’ పేరు తో ఎటువంటి ‘LIC’ స్కీం లేదు

‘LIC – కన్య ధాన్ యోజన’ పథకం లో రోజుకి 75 రూపాయలు కడితే 27 లక్షల బెనిఫిట్ పొందవొచ్చని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘LIC – కన్య ధాన్ యోజన’ పథకం లో రోజుకి 75 రూపాయలు కడితే 27 లక్షల బెనిఫిట్.    

ఫాక్ట్ (నిజం): ‘కన్య ధాన్ యోజన’ పేరు తో అసలు ఎటువంటి ‘LIC’ స్కీం లేదు. ‘Zee News’ మరియు ‘Jansatta’ వార్తాసంస్థలు కూడా ‘కన్య ధాన్ యోజన’ పేరుతో కూడా ఎటువంటి ‘LIC’ స్కీం లేదని ఆర్టికల్స్ ప్రచురించాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

‘కన్య ధాన్ యోజన’ పేరుతో ‘LIC’ వెబ్ సైట్ లో వెతకగా, ఆ పేరుతో ఎటువంటి ‘LIC’ స్కీం లేదని తెలుస్తుంది. ‘Zee News’ మరియు ‘Jansatta’ వార్తాసంస్థలు కూడా ‘కన్య ధాన్ యోజన’ పేరుతో కూడా ఎటువంటి ‘LIC’ స్కీం లేదని ఆర్టికల్స్ ప్రచురించినట్టుగా చూడవొచ్చు.

Jansatta’ ఆర్టికల్ లో ‘LIC’ వారి ‘జీవన్ లక్ష్యా’ స్కీం ని కొందరు ‘కన్య ధాన్ యోజన’ పేరుతో ప్రజలకు అమ్ముతున్నారని ఒక ‘LIC’ అధికారి చెప్పినట్టు ఉంటుంది. కావున, కనీసం ‘జీవన్ లక్ష్యా’ స్కీం లో అయిన రోజుకు 75 రూపాయలు కడితే 27 లక్షల రూపాయలు వస్తాయో చూద్దాం.

‘LIC’ వెబ్ సైట్ లో ఉన్న ‘Premium Calculator’ ద్వారా ‘జీవన్ లక్ష్యా’ స్కీం లో 27 లక్షల రూపాయలు (‘Sum Assured’ – కచ్చితంగా వచ్చేవి) రావాలంటే నెలకు ఎంత కట్టాలో లెక్కిస్తే, సుమారు 9,600 రూపాయలు కట్టాలని వస్తుంది (25 సంవత్సరాల ప్లాన్ వ్యవధి కి 22 సంవత్సరాలు కట్టాలి). అంటే, రోజుకి సుమారు 320 రూపాయలు కట్టాలి. ‘జీవన్ లక్ష్యా’ లో వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయి, కానీ ‘Sum Assured’ డబ్బులు మాత్రం కచ్చితంగా వస్తాయి.

అంతేకాదు, ప్రీమియం కట్టే వారి వయస్సు మరియు ప్లాన్ వ్యవధి బట్టి ప్రీమియం రేట్లు మారుతాయి. అవి ఎలా మారుతాయో కింద టేబుల్ లో చూడవొచ్చు.

‘LIC’ వారి ‘జీవన్ లక్ష్యా’ స్కీం గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ‘కన్య ధాన్ యోజన’ పేరు తో ఎటువంటి ‘LIC’ స్కీం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?