Fake News, Telugu
 

CT, EECP మెషీన్లు ఉపయోగించి గుండెను రీసైకిల్ చేయొచ్చనడానికి ఆధారాలు లేవు

0

గుండె కోసం డిజిటల్ మెడిసిన్ కనుగొన్నారని, CT-700 మరియు EECP అనే రెండు ఆధునిక యంత్రాలను ఉపయోగించి గుండెను రీసైకిల్ చేయొచ్చని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: CT-700, EECP అనే రెండు ఆధునిక యంత్రాలను ఉపయోగించి గుండెను రీసైకిల్ చేయొచ్చు.

ఫాక్ట్: కార్డియాక్ CT (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) అనేది హార్ట్-ఇమేజింగ్ టెస్ట్. సాధారణంగా CT స్కాన్ అని పిలుస్తారు, శరీరం యొక్క క్రాస్-సెక్షనల్ వ్యూ కోసం కంప్యూటర్ సహాయంతో ఎక్స్-రే చిత్రాలను తీస్తుంది. ఎన్‌హాన్స్‌డ్ ఎక్స్‌టర్నల్‌ కౌంటర్ పల్సేషణ్ (EECP) థెరపీ అనేది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదించబడిన చెస్ట్ పెయిన్ థెరపీ. ఇది ఇతర చికిత్సలకు స్పందించని దీర్ఘకాలిక ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి (దీర్ఘకాలిక స్థిరమైన ఆంజినా)కి చికిత్స చేస్తుంది. CT, EECP మెషీన్లు ఉపయోగించి గుండెను రీసైకిల్ చేయొచ్చనడానికి మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కంప్యూటెడ్ టోమోగ్రఫీ, సాధారణంగా CT స్కాన్ అని పిలుస్తారు, శరీరం యొక్క క్రాస్-సెక్షనల్ వ్యూ కోసం కంప్యూటర్ సహాయంతో ఎక్స్-రే చిత్రాలను తీస్తుంది. కార్డియాక్ CT అనేది హార్ట్-ఇమేజింగ్ టెస్ట్, ఇది గుండె శరీర నిర్మాణ శాస్త్రం, కరోనరీ సర్క్యులేషన్ మరియు వెస్సెల్స్ గురించి తెలుసుకోడానికి CT సాంకేతికతను ఉపయోగిస్తుంది.

కంప్యూటెడ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రామ్ (CTCA) అనేది గుండెకు రక్త ప్రవాహ పరిమితి ఉందో లేదో తనిఖీ చేయడానికి ఎక్స్-రే ఇమేజింగ్‌ని ఉపయోగించి స్క్రీనింగ్ చేస్తుంది. ఈ స్క్రీనింగ్ రక్త నాళాలలో సమస్యలను గుర్తించడానికి ఒక అధునాతన పద్ధతి. Oxymed అనే ఆసుపత్రి యొక్క వెబ్సైటులో CT యాంజియో 700 స్లైస్ అనే అధునాతన పరికరం గురించి వివరించారు. ఈ పరికరం ద్వారా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఎన్‌హాన్స్‌డ్ ఎక్స్‌టర్నల్‌ కౌంటర్ పల్సేషణ్ (EECP) థెరపీ అనేది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదించబడిన చెస్ట్ పెయిన్ థెరపీ. ఇది ఇతర చికిత్సలకు స్పందించని దీర్ఘకాలిక ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి (దీర్ఘకాలిక స్థిరమైన ఆంజినా)కి చికిత్స చేస్తుంది.

EECP చిన్న ధమనులను (artery) సక్రియం చేయడం ద్వారా మరియు మయోకార్డియల్ రక్త ప్రవాహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రోగికి ప్రయోజనం చేస్తుంది. కాబట్టి గుండె యొక్క ఎడమ వైపున అడ్డుపడినట్లయితే, కొలేటరల్ సర్క్యులేషన్ ద్వారా కుడి వైపు నుండి రక్త సరఫరా నిర్వహించబడుతుంది.

బైపాస్ సర్జరీ మరియు యాంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయంగా EECPను పరిగణించటానికి కారణాలు, ఇది సురక్షితమైనది, హాస్పిటలైజేషన్ అవసరం లేదు. యాంజియోప్లాస్టీ మరియు బైపాస్ సర్జరీతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. యాంజియోప్లాస్టీలో ఒక స్టెంట్ బ్లాకైన ఆర్టరీలో ఇన్సర్ట్ చేస్తారు.

కానీ, అందరికీ అన్నీ ప్రొసీజర్లు చేయరు, ఏది చేయాలనుకున్నా డాక్టర్ ఎక్షామిన్ చేసాక అతని/ఆమె సూచన మేరకు చేస్తారు.

చివరగా, CT, EECP మెషీన్లు ఉపయోగించి గుండెను రీసైకిల్ చేయొచ్చనడానికి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll