పుల్లారెడ్డి తమ షాపులో తయారు చేసే స్వీట్లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నామని వెల్లడించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు

పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి తమ షాపులో తయారు చేసే స్వీట్‌లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకున్నారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: పుల్లారెడ్డి తమ షాపులో తయారు చేసే స్వీట్‌లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకున్నారు.

ఫాక్ట్: జి.పుల్లారెడ్డి 09 మే 2007న మరణించాడు. జి. పుల్లారెడ్డి హిందూ జాతీయవాద సంస్థల్లో చురుకుగా పనిచేశారు. కానీ తమ షాపులో తయారు చేసే స్వీట్‌లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకున్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, పుల్లారెడ్డి తమ షాపులో తయారు చేసే స్వీట్‌లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకున్నారని ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అలా చెప్పుంటే అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి. జీ.పుల్లారెడ్డి సోషల్ మీడియా అకౌంట్స్ – ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ – లలో జీ.పుల్లారెడ్డి అలా అన్నట్టు సమాచారం లేదు.

జి. పుల్లారెడ్డి 09 మే 2007న మరణించాడు. జి. పుల్లారెడ్డి హిందూ జాతీయవాద సంస్థల్లో చురుకుగా పనిచేశారు. అతను 1974లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సంఘచాలక్ (స్థానిక డైరెక్టర్) అయ్యాడు. అతను 1980లో విశ్వహిందూ పరిషత్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు. కానీ తమ షాపులో తయారు చేసే స్వీట్లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపినట్టు ఎక్కడా రిపోర్ట్ అవ్వలేదు.

చివరగా, జి.పుల్లారెడ్డి తమ షాపులో తయారు చేసే స్వీట్లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నామని వెల్లడించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.