Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

వీడియోలో గాంధీ హాస్పిటల్ ఫ్లోర్ పై కూర్చుని ఉన్నది హాస్పిటల్ సిబ్బంది; కొరోనా వైరస్ సోకిన రోగులు కాదు

0

ఇద్దరు మహిళలు పీపీఈ (PPE) కిట్స్ వేసుకుని హాస్పిటల్ ఫ్లోర్ పై కూర్చుని ఉన్న వీడియో ని సోషల్ మీడియా లో పోస్టు చేసి ‘గాంధీ హాస్పిటల్ లో కరోనా రోగుల యొక్క దయనీయ పరిస్థితి’ అని వైరల్ చేస్తున్నారు.  హైదరాబాద్ లో కోవిడ్-19 నిర్ధారణ అయిన వారికి గాంధీ హాస్పిటల్ లో చికిత్సని అందిస్తున్న తరుణం లో వీడియోని సోషల్ మీడియా లో పోస్టు చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ (COVID – 19 చికిత్సకి ప్రత్యేక ఆసుపత్రి) లో కొరోనా రోగుల దయనీయ పరిస్థితి వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో గాంధీ హాస్పిటల్ ఫ్లోర్ పై కూర్చుని ఉన్నది హాస్పిటల్ సిబ్బంది; కొరోనా వైరస్ సోకిన రోగులు కాదు. కావున పోస్ట్ లో చెప్పిన విషయం తప్పు.

వీడియో లోని సమాచారం ఆధారంగా గూగుల్ లో కీవర్డ్స్ తో వెతకగా, సెర్చ్ రిజల్ట్స్ లో వీడియో గాంధీ హాస్పిటల్ లో కొరోనా రోగుల పరిస్థితిది అంటూ ‘Tv9’ (ఆర్చివ్డ్) మరియు ‘Sakshi’ (ఆర్చివ్డ్) ప్రసారం చేసినట్లుగా చూడవచ్చు. ‘The News Minute’ వార్తా సంస్థ కూడా ఆ వీడియో గురించి ఆర్టికల్ ని రాసింది. అయితే, ఆ వార్తా సంస్థ వారు వీడియో గురించి సమాచారం గురించి గాంధీ హాస్పిటల్ లోని ఒక రెసిడెంట్ డాక్టర్ ని సంప్రదించినప్పుడు, వీడియో లో ఉన్నది హాస్పిటల్ శానిటేషన్ వర్కర్లని ఆయన తెలిపారు. ‘Andhra Jyoti’ వార్తా పత్రిక కూడా వీడియోలోని వారు హాస్పిటల్ నర్సులని రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు. వీడియో వైరల్ అవ్వడంతో ‘TNIE’ వార్తా సంస్థ కూడా ఒక కథనాన్ని ప్రచురించి వీడియోలోని వారు గాంధీ హాస్పిటల్ సిబ్బందని ఆ హాస్పిటల్ అధికారులు స్పష్టం చేసినట్లుగా తెలిపారు. FACTLY కూడా గాంధీ హాస్పిటల్ లో పనిచేస్తున్న ఒక డాక్టర్ తో మాట్లాడగా వీడియోలో ఉన్నది హాస్పిటల్ సిబ్బంది అని తెలిపాడు.

వీడియో లోని మహిళలు పీపీఈ కిట్స్ వేసుకుని కనిపిస్తారు. కానీ కొరోనావైరస్ రోగులు పీపీఈ కిట్స్ ధరించరు. హాస్పిటల్ సిబ్బంది కొరోనావైరస్ రోగులకు చికిత్సని అందించే సమయంలో తమను తాము రక్షించుకోవడానికి పీపీఈ కిట్స్ ధరిస్తారు. కావున వీడియోలోని వారు హాస్పిటల్ సిబ్బంది; కొరోనా వైరస్ రోగులు కాదు. 

చివరగా, వీడియోలో గాంధీ హాస్పిటల్ ఫ్లోర్ పై కూర్చుని ఉన్నది హాస్పిటల్ లోని నర్సులు; కొరోనావైరస్ సోకిన రోగులు కాదు. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll