AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హనుమాన్ ఆలయంలో హారతి ఇస్తున్న దృశ్యాలంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు

AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హనుమాన్ ఆలయంలో హారతి నిర్వహిస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియో నిజమైన సంఘటనను చూపిస్తున్నట్లు పలువురు యూజర్లు షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హనుమాన్ ఆలయంలో హారతి నిర్వహిస్తున్న దృశ్యాలు. 

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ దృశ్యాలు AI ద్వారా రూపొందించబడ్డాయని AI-డిటెక్షన్ టూల్స్ నిర్థారించాయి. AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హనుమాన్ ఆలయంలో హారతి నిర్వహించారని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా, వైరల్ వీడియోలో పేర్కొన్నట్లుగా AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హనుమాన్ ఆలయంలో హారతి నిర్వహించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారలు లభించలేదు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, వీడియోలో ‘Gemini AI’ లోగో వాటర్‌మార్క్‌ను మనం చూడవచ్చు. ఈ వాటర్‌మార్క్‌ ఈ వైరల్ వీడియోను గూగుల్ వారి ‘Gemini AI’ మోడల్‌ను ఉపయోగించి రూపొందించబడిందని సూచిస్తుంది. 

తదుపరి, ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, సింథ్ ID, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, రెండు AI-డిటెక్షన్ టూల్స్ ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని సూచించాయి.

చివరిగా, AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ హనుమాన్ ఆలయంలో హారతి నిర్వహిస్తున్న దృశ్యాలంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను షేర్ చేస్తున్నారు.