వీడియోలో మహిళని వేధిస్తున్న ఘటన భైంసా (తెలంగాణ) లో జరగలేదు

ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, అందులోని ఘటన భైంసా (తెలంగాణ) లో జరిగిందని చెప్తున్నారు. పోస్టులో చెప్పిన విషయం ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భైంసా (తెలంగాణ) లో మహిళని వేధిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన 2017లో ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో జరిగింది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో తో ఉన్న ‘Times of India’ వారి కథనం లభించింది. దాని ద్వారా, ఆ వీడియోలోని ఘటన 2017లో ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ జరిగిందని తెలిసింది. అదే విషయాన్ని ‘NDTV’ వారి కథనం లో కూడా చూడవచ్చు. నిందితుల గురించి సమాచారం కోసం ఇక్కడ చదవొచ్చు.

చివరగా, వీడియోలో మహిళని వేధిస్తున్న ఘటన భైంసా (తెలంగాణ) లో జరగలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?