హోటల్ లో తనకు రూమ్ లేదనడంతో తన విగ్రహం ముందే పడుకున్న ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ అంటూ చెప్పిన కథలో నిజం లేదు

తను గవర్నర్ గా ఉన్నప్పుడు ప్రారంభించిన హోటల్ లో తనకు రూమ్ లేదని చెప్పడంతో తన విగ్రహం ముందే ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ పడుకున్నాడు అని చెప్తూ ఒక పోస్ట్ ని షేర్ అవుతుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాను ప్రారంభించిన హోటల్ లో తనకు రూమ్ లేదనడంతో తన విగ్రహం ముందే పడుకున్న ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్.

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని విగ్రహం ‘Greater Columbus Convention Center’ లో ఉంది. 2016 లో ఒక మూవీ షూటింగ్ కోసం ఆర్నాల్డ్ ఒహియో వచ్చాడు. ఆ సమయంలో తను ఆ కన్వెన్షన్ సెంటర్ ని సందర్శించినప్పుడు తీసిన ఫోటో అది. ‘Daily’ Mail’ వెబ్ సైట్ ప్రకారం తను కేవలం తన విగ్రహం ముందు పడుకున్నట్టు కొద్ది సేపు పోస్ ఇచ్చాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ తన సోషల్ మీడియా అకౌంట్లలో (ఫేస్బుక్, ట్విట్టర్, మరియు ఇన్స్టాగ్రామ్) జనవరి 2016 లో ‘How times have changed.’ అని పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. పోస్ట్ లో పెట్టిన కథ గురించి తను ఎక్కడా కూడా రాయలేదు.

ఈ ఘటన పై 2016 లో వార్తాపత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ కోసం వెతకగా, ‘Daily Mail’ వారు ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో అదే ఫోటో ఉంటుంది. ఆ ఫోటో కింద వివరణలో ఆర్నాల్డ్ తన విగ్రహం ముందు పడుకునట్టు నటిస్తూ పోస్ ఇచ్చాడని రాసి ఉంటుంది. ‘People’ సంస్థ ప్రచురించిన ఆర్టికల్ లో కూడా ఆర్నాల్డ్ కేవలం కొద్ది సేపు తన విగ్రహం ముందు పడుకున్నట్టు చేసాడని ఉంటుంది. ఆర్టికల్స్ లోఎక్కడా కూడా పోస్ట్ లో చెప్పిన కథ ఉండదు.

అంతేకాదు, ‘E News’ వారు ప్రచురించిన ఆర్టికల్ లో పోస్ట్ లోని ఫోటోని ‘Greater Columbus Convention Center’ బయట తీసినట్టు ఉంటుంది. ఆ విగ్రహం గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ చదవొచ్చు.

ఇలాంటి పోస్టులే వేరే దేశాల్లో కూడా వైరల్ అయినప్పుడు, వేరే ఫాక్ట్ చెకింగ్ సంస్థలు రాసిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, హోటల్ లో తనకు రూమ్ లేదనడంతో తన విగ్రహం ముందే పడుకున్న ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ నెగ్గర్ అంటూ చెప్పిన కథలో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?