ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకుని చదువుతున్నాడు అని చెప్తూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకుని చదువుతున్న దృశ్యాలను చూపిస్తున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకుని చదువుతున్నట్లు చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో ఫేక్. అసలు ఫోటోను మార్ఫింగ్ చేస్తూ ఈ వైరల్ ఫోటోను రూపొందించారు. వాస్తవంగా, పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని సరిగానే పట్టుకున్నాడు. ఈ వైరలో ఫోటో యొక్క అసలు ఫోటోను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ & పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 08 నవంబర్ 2025న తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు తీశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన వివరాల కోసం, ఫోటోను గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇలాంటి ఫోటోనే రిపోర్ట్ చేస్తూ పలు తెలుగు మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాలు రిపోర్ట్ చేసిన ఫోటోలో, పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని సరిగ్గా పట్టుకోవడం మనం చూడవచ్చు. ఈ ఫోటోను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అటవీ & పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 08 నవంబర్ 2025న తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు తీసినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి.
దీన్ని బట్టి అసలు ఫోటోను డిజిటల్‌గా ఎడిట్ చేస్తూ ఈ వైరల్ ఫోటోను రూపొందించారని తెలుస్తుంది. వాస్తవంగా, పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని సరిగానే పట్టుకున్నాడు. అసలు ఫోటో, వైరల్ ఫోటో మధ్య తేడాలను కింద చూడవచ్చు.
చివరగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకుని చదువుతున్నట్లు చూపిస్తున్న ఈ ఫోటో మార్ఫింగ్ చేయబడింది.