2016 – 2018 మధ్యలో 84,374 రేపులు జరిగితే, 81,000 ముస్లిం రేపిస్టులు ఉన్నారనేది ఫేక్ న్యూస్.

భారతదేశంలో 2016 మరియు 2018 సంవత్సరాల మధ్యలో 84,374 రేపులు జరిగితే, 81,000 ముస్లిం రేపిస్టులు ఉన్నారని ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారతదేశంలో 2016 మరియు 2018 సంవత్సరాల మధ్యలో జరిగిన రేపులు 84,374, ముస్లిం రేపిస్టులు 81,000.

ఫాక్ట్ (నిజం): 2018 డేటాను NCRB ఇంకా రిలీజ్ చేయలేదు. NCRB రిలీజ్ చేసే క్రైమ్ రిపోర్ట్ లలో మతాల వారిగా ఎటువంటి డేటాని రిలీజ్ చేయరు. రేప్ కేసుల డేటా లో కూడా అలాంటి విభజన లేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

దేశంలో జరిగిన క్రైమ్ గురించి సంవత్సరాల వారీగా ‘National Crime Records Bureau (NCRB)’ వారు డేటా రిలీజ్ చేస్తారు. తాజాగా, వారు ‘Crime in India – 2017’ రిపోర్ట్ ని రిలీజ్ చేసారు. 2018 డేటా ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ, పోస్టులో మాత్రం 2018 సంవత్సరం గురించీ కూడా ప్రస్తావించారు. కావున, ఆ నంబర్లు సరైనవని కావు.

అంతేకాదు, NCRB రిలీజ్ చేసే క్రైమ్ రిపోర్ట్ లలో మతాల వారిగా ఎటువంటి డేటాని రిలీజ్ చేయరు. రేప్ కేసుల డేటా లో కూడా అలాంటి విభజన లేదు.

2016 మరియు 2017 లో ఎన్ని రేపులు రిపోర్ట్ అయ్యాయో ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, 2016 – 2018 మధ్యలో 84,374 రేపులు జరిగితే, 81,000 ముస్లిం రేపిస్టులు ఉన్నారనేది ఫేక్ న్యూస్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?