ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై పిన్ పాయింట్ స్ట్రైక్స్ చేయలేదు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ పాడ్లపై భారత ఆర్మీ పిన్ పాయింట్ స్ట్రైక్స్ నిర్వహించిందని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ పాడ్లపై పిన్ పాయింట్ స్ట్రైక్స్ నిర్వహించింది.

ఫాక్ట్ (నిజం): ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఎటువంటి స్ట్రైక్స్ చేయలేదని ఇండియన్ ఆర్మీ వివరణ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ పాడ్లపై ఇండియన్ ఆర్మీ పిన్ పాయింట్ స్ట్రైక్స్ నిర్వహిస్తుందని PTI విడుదల చేసిన ఒక రిపోర్ట్ ఈ గందరగోళానికి కారణమైందని, ఐతే 13 నవంబర్ 2020న జరిగిన కాల్పుల విరమణ ఉల్లంఘనలపై జరిపిన ఎనాలిసిస్ ఆధారంగా PTI ఈ రిపోర్ట్ విడుదల చేసిందే తప్ప LoC దగ్గర ఎటువంటి ఫైరింగ్ జరగలేదని ఇండియన్ ఆర్మీ వివరణ ఇచ్చింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయం గురించి మరింత సమాచరం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ విషయంపై ANI వార్తా సంస్థ చేసిన ట్వీట్ మాకు కనిపించింది.  ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఎటువంటి దాడి చేయలేదని ఇండియన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ అఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అయిన Lt.Gen. పరంజిత్ సింగ్ తెలిపడనేది ఈ ట్వీట్ సారాంశం. ఇండియన్ ఆర్మీ స్ట్రైక్స్ నిర్వహించిందన్న రిపోర్ట్స్ ఫేక్ అని ఈ ట్వీట్ తేల్చేసింది. ఈ విషయం పై  ANI చేసిన మరొక ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.

ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఎటువంటి స్ట్రైక్స్ చేయలేదని,13 నవంబర్ 2020న జరిగిన కాల్పుల విరమణ ఉల్లంఘనలపై జరిపిన ఎనాలిసిస్ ఆధారంగా PTI ఈ రిపోర్ట్ విడుదల చేసిందని ఇండియన్ ఆర్మీ వివరణ ఇచ్చిందని చేప్తున్న వార్తా కథనం ఇక్కడ చదవొచ్చు.

ఇంకా ఈ విషయం పై వివరణ ఇస్తూ LoC కి వెలుపల టెర్రరిస్ట్ లాంచ్ పాడ్స్ పై ఇండియన్ ఆర్మీ ఎటువంటి స్ట్రైక్స్ నిర్వహించలేదని PIB ఒక ట్వీట్ ద్వారా నిర్ధారించింది. ఇండియన్ ఆర్మీ స్ట్రైక్స్ నిర్వహించిందన్న వార్త ఫేక్ అని ఈ ట్వీట్ ద్వారా తెలిపింది. ఇదే విషయం తెలుపుతున్న మరొక వార్తా కథనం ఇక్కడ చదవొచ్చు.

ఐతే పాకిస్తాన్ ఇండియాలోకి టెర్రరిస్ట్ లను పంపడానికి చేసే ప్రయత్నాలకు బదులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ పాడ్లపై ఇండియన్ ఆర్మీ పిన్ పాయింట్ స్ట్రైక్స్ నిర్వహిస్తుందని PTI విడుదల చేసిన ఒక రిపోర్ట్ నేపధ్యంలో చాలావరకు వార్తా సంస్థలు ఈ విషయాన్ని ప్రచురించాయి, ఇంకా సోషల్ మీడియాలో కూడా ఈ వార్తా చాలా వైరల్ గా మారింది. ఐతే 13 నవంబర్ 2020న జరిగిన కాల్పుల విరమణ ఉల్లంఘనలపై జరిపిన ఎనాలిసిస్ ఆధారంగా PTI ఈ రిపోర్ట్ విడుదల చేసిందని ఇండియన్ ఆర్మీ వివరణ ఇచ్చింది.

చివరగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ ఎటువంటి పిన్ పాయింట్ స్ట్రైక్స్ నిర్వహించలేదు.