అయోధ్యలో కట్టబోయే రామ మందిరం యొక్క డిజైన్ అని చెప్తూ ఒక మందిరం ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: అయోధ్యలో కట్టబోయే రామ మందిరం యొక్క డిజైన్ ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది అయోధ్యలో కట్టబోయే రామ మందిరం యొక్క డిజైన్ కాదు, 2010 లోనే భుజ్ లో ప్రారంభమైన ‘శ్రీ స్వామినారాయణ్ మందిరం’. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ చేసిన ఫోటోలో కింద ‘www.bhujmandir.org’ అని రాసి ఉన్నట్టు చూడొచ్చు. కావున, గూగుల్ లో ‘bhuj mandir’ అని వెతకగా, ఫోటోలో ఉన్న మందిరం భుజ్ లో ఉన్న ‘శ్రీ స్వామినారాయణ్ మందిరం’ అని తెలుస్తుంది.
పోస్ట్ లోని ఫోటోని ‘శ్రీ స్వామినారాయణ్ మందిరం’ కి చెందిన ‘Flickr’ అకౌంట్ లో 2010 లోనే పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. ఆ మందిరానికి సంబంధించిన మరిన్ని ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఆ మందిరాన్ని 2010 లోనే మోడీ ప్రారంభించినట్టు ‘Desh Gujarat’ ఆర్టికల్ లో చదవొచ్చు. కావున, పోస్ట్ లోని ఫోటోలో ఉన్నది అయోధ్యలో కట్టబోయే రామ మందిరం డిజైన్ కాదు.
చివరగా, భుజ్ లోని ‘శ్రీ స్వామినారాయణ్ మందిరం’ ఫోటో పెట్టి, ‘అయోధ్యలో కట్టబోయే రామ మందిరం’ అని ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: భుజ్ లోని ‘శ్రీ స్వామినారాయణ్ మందిరం’ ఫోటో పెట్టి, ‘అయోధ్యలో కట్టబోయే రామ మందిరం’ అని ప్రచారం