రాహుల్ గాంధీ పై వేసిన 2006 రేప్ కేసును సుప్రీం కోర్టు 2012 లోనే కొట్టి వేసింది

2006 లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసినట్టు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మీద కేసు ఉందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2006 లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసినట్టు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మీద కేసు ఉంది.

ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీ పై ఉన్న కేసును సుప్రీం కోర్టు 2012 లోనే కొట్టి వేసింది. ఆ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొనింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి గూగుల్ లో వెతకగా,  ఈ విషయం పై ‘India Today’ వారు అక్టోబర్ 2012 లో ప్రచురించిన ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ద్వారా రాహుల్ గాంధీ పై ఉన్న 2006 రేప్ కేసును సుప్రీం కోర్టు 2012 లోనే కొట్టి వేసినట్టు తెలుస్తుంది. రాహుల్ గాంధీ పై చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొనింది. అంతేకాదు, తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ ఎస్.పీ. ఎం.ఎల్.ఏ కిషోర్ సమ్రితే పై సుప్రీమ్ కోర్టు ఫైన్ కూడా వేసింది. ఈ కేసు పై సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ చదవొచ్చు.

కేసు కోర్టులో ఉన్నప్పుడు, తన మీద చేసిన ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని రాహుల్ గాంధీ అఫిడవిట్ ఫైల్ చేసినట్టు ‘The Times of India’ ఆర్టికల్ లో చూడవొచ్చు.

చివరగా, రాహుల్ గాంధీ పై వేసిన 2006 రేప్ కేసును సుప్రీం కోర్టు 2012 లోనే కొట్టి వేసింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?