విదేశాల్లో ఒక బాలుడు రెక్కలతో జన్మించాడు అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక శిశువు వీపు మీద చిన్న రెక్కలు ఉండడం మనం చూడవచ్చు. వీడియో చివర్లో ఆ బాలుడు తన తల్లి దగ్గర నుండి వెళ్ళిపోతూ గాల్లోకి ఎగిరి వెళ్లడం మనం చూడవచ్చు. ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొందాం.
క్లెయిమ్: రెక్కలతో జన్మించిన ఒక శిశువు యొక్క నిజమైన వీడియో.
ఫ్యాక్ట్: 2009లో విడుదల అయిన రిక్కీ అనే ఫ్రెంచ్ సినిమాలోని కొన్ని క్లిప్స్‌ని జోడించి ఈ వీడియోని తయారు చేసారు. ఇది నిజంగా రెక్కలతో జన్మించిన శిశువు యొక్క వీడియో కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోలో వచ్చే నెరేషన్లో, ఆ బాలుడి పేరు రిక్కీ అని అనడం మనం వినచ్చు. దీన్ని హింట్‌గా తీస్కొని ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతుకుతుండగా (ఇక్కడ,ఇక్కడ), ఈ వీడియో క్లిప్స్ ఒక సినిమాకి చెందినవి అని మాకు తెలిసింది.
రిక్కీ అనే 2009 నాటి ఫ్రెంచ్ బాషా ఫాంటసీ సినిమా యొక్క కొన్ని క్లిప్స్‌ని ఉపయోగించి ఈ వీడియోని తయారు చేసారు. ఫ్రాంకోయిస్ ఓజోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యొక్క కథ, పుట్టుకతోనే రెక్కలతో జన్మించిన రిక్కీ అనే ఒక బాలుడి చుట్టూ నడుస్తుంది.
వైరల్ వీడియోలో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఉన్నాయి వాటిని మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, ఒక ఫ్రెంచ్ భాష సినిమాలోని క్లిప్స్ షేర్ చేస్తూ, విదేశాల్లో రెక్కలతో జన్మించిన శిశువు యొక్క నిజమైన వీడియో అని తప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు.