Fake News, Telugu
 

తమకు నచ్చిన నరేంద్ర మోదీ మరియు మన్మోహన్ సింగ్ ఫోటోలను పెట్టి, సందర్భం చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు

0

ప్రపంచాన్ని తన వెనుక నడిపిస్తున్న ప్రధాని మోదీ ఫోటో అని చెప్తూ, ఇటీవల జరిగిన క్వాడ్ సదస్సుకి సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, ఒకప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా, ప్రపంచ నాయకులు అతని వైపు చూసేవారని గొప్పగా చెప్తూ మరికొందరు ఇంకో ఫోటోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రపంచాన్ని తన వెనుక నడిపిస్తున్న ప్రధాని మోదీ ఫోటో; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రపంచ నాయకులు అతని వైపు చూస్తున్న మరో ఫోటో.

ఫాక్ట్: పోస్ట్‌లోని ఫోటోలు నిజమైనవే, ఎడిట్ చేసినవి కావు. అయితే, క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ వెనుక నడుస్తూ, ఇతర నాయకులు ముందు నడుస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అలానే, పోస్ట్ చేసిన ఫోటోలో ప్రపంచ నాయకులు మన్మోహన్ సింగ్ వైపు చూస్తున్నది తను గ్రూప్ ఫోటోకి ఆలస్యంగా రావడం వల్ల. కావున, బీజేపీ మద్దతుదారులు మోదీ ముందు నడుస్తున్న ఫోటోని మాత్రమే షేర్ చేసి, ఇతర ఫోటోలను షేర్ చేయకుండా, మరియు కాంగ్రెస్ మద్దతుదారులు పెట్టిన ఫోటో యొక్క అసలు సందర్భం చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు.

ప్రధాని మోదీ ఫోటో:

పోస్ట్ చేసిన ప్రధాని మోదీ యొక్క ఫోటో ఇటీవల జరిగిన క్వాడ్ సదస్సుకి సంబంధించినదే. అయితే, ఆ సదస్సుకి  సంబంధించిన ఇతర ఫోటోలు చూడగా, కొన్ని ఫోటోల్లో ప్రధాని మోదీ ఇతర నాయకుల వెనుక నడుస్తున్న సందర్భాలు కూడా ఉన్నట్టు తెలిసింది. ఆ సందర్భాలకి సంబంధించిన ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. కావున, బీజేపీ మద్దతుదారులు మోదీ ముందు నడుస్తున్న ఫోటోని మాత్రమే షేర్త చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోటో:

పోస్ట్ చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ యొక్క ఫోటో గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆ ఫోటో ‘Getty Images’ వెబ్సైటులో దొరికింది. అయితే, ఆ ఫోటోలో ప్రపంచ నాయకులు మన్మోహన్ సింగ్ వైపు చూస్తున్నది తను గ్రూప్ ఫోటోకి ఆలస్యంగా రావడం వల్ల అని ఆ ఫోటో వివరణలో చదవచ్చు. ఇదే విషయం ఇతర వెబ్సైటుల్లో (ఇక్కడ మరియు ఇక్కడ) కూడా చదవచ్చు. ఆ 2012 జీ20 సదస్సు గ్రూప్ ఫోటోకి సంబంధించిన కొన్ని వీడియోలను ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు. కావున, కాంగ్రెస్ మద్దతుదారులు పెట్టిన మన్మోహన్ సింగ్ ఫోటో యొక్క అసలు సందర్భం చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, తమకు నచ్చిన మోదీ మరియు మన్మోహన్ సింగ్ ఫోటోలను పెట్టి, సందర్భం చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll