ప్రజలు తమ ఇళ్ళల్లోనే ఉండాలని 800 సింహాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ బయటకు విడిచి పెట్టలేదు

కొరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు తమ ఇళ్ళల్లోనే ఉండాలని, 800 సింహాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ బయటకు విడిచి పెట్టినట్టు చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రజలు తమ ఇళ్ళల్లోనే ఉండాలని 800 సింహాలను బయటకు విడిచి పెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటోకీ, రష్యాకి అసలు సంబంధం లేదు. సౌత్ ఆఫ్రికాలో ఒక సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటో అది. ప్రజలు తమ ఇళ్ళల్లోనే ఉండాలని 800 సింహాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ బయటకు విడిచిపెట్టలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోతో 2016 లో ప్రచురించిన ‘Daily Mail’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఒక సినిమా షూటింగ్ లో భాగంగా సినిమా బృందం ఆ సింహాన్ని వీధిలో విడిచి పెట్టినట్టు ఆ ఆర్టికల్ లో చదవొచ్చు. కావున, అది రష్యా కి చెందిన ఫోటో కాదు. అంతేకాదు, ప్రజలు తమ ఇళ్ళల్లోనే ఉండాలని 800 సింహాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ బయటకు విడిచి పెట్టినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు.

కొందరు అదే క్లెయిమ్ తో ఉన్న ‘బ్రేకింగ్ న్యూస్’ ఫోటో (ఆర్కైవ్డ్) పెడుతున్నారు. అయితే అది ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ‘Break your own news’ అనే వెబ్సైటులో తమకు నచ్చిన ఫోటో మరియు న్యూస్ పెట్టి, బ్రేకింగ్ న్యూస్ ఫోటో తయారు చేయవచ్చు.

చివరగా, ప్రజలు తమ ఇళ్ళల్లోనే ఉండాలని 800 సింహాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ బయటకు విడిచి పెట్టలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?