పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) తాను అనుకూలమని రజనీకాంత్ వ్యాఖ్యానించలేదు

CAA ని వ్యతిరేకిస్తున్నారు అంటే వాడు దేశద్రోహి అయినా అయి ఉంటాడు, లేదా చట్టం పై అవగాహన లేకపోవచ్చు,లేదా ఉద్దేశ్య పూర్వకంగా దేశాన్ని సర్వనాశనం చేయాలి అనే దురుద్దేశ్యంతో తప్పుడు ప్రచారం చేస్తున్న వాడు అయి ఉండాలి,అంతిమం గా ఈ చట్టం దేశాన్ని సురక్షితంగా ఉంచే చట్టం, నేను పూర్తిగా CAA కి మద్దతు ఇస్తున్న, అవసరమైన పక్షంలో దేశవ్యాప్తంగా ప్రచారం చేసి, ప్రజల మద్దతు కూడకడతా’ అని తమిళ హీరో రజనీకాంత్ వ్యాఖ్యానించాడని ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తమిళ హీరో రజనీకాంత్: ‘నేను పూర్తిగా CAA కి మద్దతు ఇస్తున్న, అవసరమైన పక్షంలో దేశవ్యాప్తంగా ప్రచారం చేసి, ప్రజల మద్దతు కూడకడతా’.

ఫాక్ట్ (నిజం): పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి రజనీకాంత్ పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తాపత్రికలు కానీ, మీడియా కానీ ఎక్కడా కూడా ప్రచురించలేదు. తన ట్విట్టర్ లో కూడా ఇటువంటి ట్వీట్ లేదు. తన కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

రజనీకాంత్ పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేశాడా అని తెలుసుకోవడానికి గూగుల్ లో ‘rajnikanth said he supports citizenship amendment act’ అని వెతికినప్పుడు, రజనీకాంత్ అలా వ్యాఖ్యానించడానికి  సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా సెర్చ్ రిజల్ట్స్ లో లభించలేదు.

రజనీకాంత్ ట్విట్టర్ అకౌంట్ లో చూసినప్పుడు, అందులో కూడా రజనీకాంత్ పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో తన చివరి ట్వీట్ డిసెంబర్ 19న పెట్టారు. ఆ ట్వీట్ లో రజనీకాంత్ ‘హింస అనేది ఏ సమస్యకి పరిష్కారం కాదు మరియు అల్లర్లు ఒక మార్గం కాదు. జాతీయ భద్రత మరియు దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ ప్రజలందరు ఐక్యంగా మరియు అవగాహనతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న హింస నా మనసుకు చాలా బాధాకరం’ అని రాశారు. ఆ ట్వీట్ లో కూడా రజనీకాంత్ ఎక్కడా CAA కి మద్దతు ఇస్తున్నట్టు చెప్పలేదు.

ఒక వేల రజనీకాంత్ నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే దేశం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలు మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి వార్త ఎవరు కూడా ప్రచురించలేదు.

చివరగా, పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) తాను అనుకూలమని రజనీకాంత్ వ్యాఖ్యానించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?