క్విక్ చెక్: వెనిజులా దేశంలో తీసిన పాత ఫోటోలు పెట్టి, కొరోనా కారణంగా ఇటలీ లో ప్రజలు డబ్బుని రోడ్ల మీద పడేస్తున్నారని షేర్ చేస్తున్నారు

ఇటలీ లోని ధనవంతులు తమ దగ్గర ఉన్న డబ్బుని రోడ్ల మీద పడేశారు…ఈ డబ్బు మా పిల్లల్ని ,మా కుటుంబ సభ్యుల్ని కాపాడుకోలేకపోయింది అని రోడ్ల మీద డబ్బుని చల్లారు‘ అని చెప్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, అవి పాత ఫోటోలని, వాటికీ, కొరోనా వ్యాధి తీవ్రతకి ఎటువంటి సంబంధం లేదని FACTLY విశ్లేషణలో తేలింది. వెనిజులా దేశంలో ద్రవ్యోల్బణంతో నోట్లకు విలువ లేకుండా పోవడంతో అలా రోడ్ల పై వేసారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://dailytimewaster.blogspot.com/2019/04/socialist-venezuela-today-thats-money.html
https://twitter.com/descifraguerra/status/1105393223462207488
https://medium.com/@thegilty/cucuta-colombia-serving-as-a-gateway-to-venezuela-venezuelans-bitcoin-606a6645112f

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?