ఏడేళ్ల ముందు వీడియోని పెట్టి, తాజాగా ట్రైన్స్ మీద లారీలను ఎక్కించి ప్రధాని మోదీ తెలివిగా పంపిస్తున్నట్టు షేర్ చేస్తున్నారు

మరోసారి మోడీ గారు గొప్పతెలివి చూడండి. నిత్యావసర వస్తువులు రోడ్డుమార్గం ద్వారా ఆలస్యం కావొచ్చు, ఇంకా వాటిని ఎవరైనా ఇన్ఫెక్ట్ చేయొచ్చు లేదా ప్రజలకు అందకుండా నాశనం చేయొచ్చు అని తెలివిగా గూడ్స్ ని ఇండియన్ రైల్వేలో రిజిస్టర్ చేయించి, ట్రైన్స్ మీద లారీలనే ఎక్కించి రాష్ట్రాల వారిగా పంపిస్తూ, అవి సురక్షితంగా చేరుకున్నాక రాష్ట్ర ప్రభుత్వాలనుండి సమాచారాన్ని తిరిగి పొందేలా ఏర్పాటు చేయటం జరిగింది…‘ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, అది ఒక పాత వీడియో అని, కనీసం 2013 నుండి అదే వీడియో ఇంటర్నెట్ లో ఉందని FACTLY విశ్లేషణలో తేలింది. అంతేకాదు, లారీలను ట్రైన్స్ మీద తీసుకొని వెళ్లే సర్వీస్ ను ఎప్పటినుండో కొంకన్ రైల్వే వారు నిర్వహిస్తున్నారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://www.youtube.com/watch?v=gA0imqy8W5k
http://www.konkanrailway.com/department/viewdept/roll_on_roll_off_services/

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?