ఫోటో భారత దేశానికి సంబంధించినది కాదు. అది 2008 లో నేపాల్ లో జరిగిన ఒక ఘటనది

ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పోస్టు చేసి, అది భారత దేశానికి సంబంధించినదని అందులో పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక సైనికుడు మహిళా నిరసనకారురాలిని టీ-షర్ట్ పట్టుకుని లాగుతున్న ఫోటో భారత దేశానికి సంబంధించింది.

ఫాక్ట్ (నిజం): ఫోటో 2008 లో ఖాట్మండు (నేపాల్) లో జరిగిన ఒక సంఘటనకి సంబంధించినది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులోని ఫోటోని ‘TinEye’ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ‘Adobe Stock’ వారి ఇమేజ్ లైబ్రరీ లో లభించింది. అందులో, దాని గురించి ఉన్న వివరణ ద్వారా ఆ ఫోటో 2008 లో ఖాట్మండు (నేపాల్) లోని ఐక్యరాజ్యసమితి భవనం ముందు ఒక టిబెటన్ నిరసనకారురాలిని పోలీసు అధికారులు పట్టుకున్నప్పుడు, వారి నుండి ఆమె విడిపించుకోడానికి ప్రయత్నిస్తున్నప్పటిదని తెలుస్తుంది. కావున, ఆ ఫోటో భారత దేశానికి సంబంధించినది కాదు.

చివరగా, ఫోటో భారత దేశానికి సంబంధించినది కాదు. అది 2008 లో నేపాల్ లో జరిగిన ఒక ఘటనది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?