జనతా కర్ఫ్యూ రోజు తీసిన ఫోటోని, సూర్యగ్రహణం రోజు ఖాళీగా ఉన్న రోడ్లు అని షేర్ చేస్తున్నారు

‘సూర్య గ్రహణం పై ఉన్నంత భయం, ప్రజలకు కరోన వ్యాధి పైలేదు’ అని అర్ధం వచ్చేలా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా వైరస్ సమయంలో రద్దీగా ఉన్న రోడ్లు, సూర్య గ్రహణం రోజ ఖాళీగా ఉన్న ఫోటో. 

ఫాక్ట్ (నిజం): ): పోస్టులో ఉన్న ఫోటోలు కరోనా వైరస్ మరియు సూర్య గ్రహణం సమయంలో తీసినవి కావు. రోడ్లు రద్దీగా ఉన్న ఫోటో కరోనా వ్యాప్తి కంటే ముందు 5 ఫిబ్రవరి 2020న తీస్తే, ఖాళీగా ఉన్న ఫోటో జనతా కర్ఫ్యూ రోజు, 22 మర్చి 2020న తీశారు. కావున పోస్ట్ లోని క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటోలు 21 జూన్ 2020 నాడు వచ్చిన సుర్యగ్రహనానికి సంభందించినవి కావు, అని తెలిసింది. ఈ ఫోటోలు 22 మార్చ్ 2020 నాడు విధించిన జనతా కర్ఫ్యూ కి సంబంధించినవిగా, మంజునాథ్ కిరణ్ అనే బెంగుళూరుకి చెందిన ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలు చిత్రీకరించినట్టు ‘getty images’లో ఇచ్చిన వివరణ ద్వారా తెలిసింది. మార్చ్ 22 నాడు, భారత ప్రభుత్వం కరోన వ్యాప్తి నివారించడానికి దేశంలో జనతా కర్ఫ్యూ ప్రకటించింది. దీనికి సంఘీభావం తెలుపుతూ ప్రజలందరూ ఆ రోజు తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు ట్రాఫిక్ తో రద్దీగా ఉండే బెంగుళూరు లోని ఒక రోడ్డు జనతా కర్ఫ్యూ కారణంగా నిర్మానుష్యంగా మారిందంటూ మంజునాథ్ ఈ ఫోటోలను షేర్ చేసారు.

చివరగా, జనతా కర్ఫ్యూ రోజు నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల ఫోటోలని సూర్యగ్రహణం రోజు ఖాళీగా ఉన్న రోడ్లని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?