పాల్గర్ ఘటన మతపరమైన దాడి కాదు. పుకార్లు నమ్మి, దొంగలు అనుకొని కొట్టి చంపేసారు.

మహారాష్ట్రలోని పాల్గర్ లో కషాయం ధరించి ఉన్న ముగ్గురు సాధువుల్ని అక్కడ ఉన్న వందల మంది ముస్లిం కలిసి కొట్టి చంపేశారు‘ అని చెప్తూ కొన్ని వీడియోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. నిజంగానే ఆ ఘటన పాల్గర్ జిల్లాలో జరిగినట్టు FACTLY విశ్లేషణలో తేలింది. కానీ, పోస్టులో చెప్పినట్టు అది మతపరమైన దాడి కాదు. దొంగలు తిరుతున్నారని కొన్ని పుకార్లు రావడంతో వందకు పైగా గ్రామస్తులు గూమిగూడి అటుగా వచ్చిన ముగ్గురిని దొంగలు అనుకొని కొట్టి చంపేసారు. చనిపోయిన వారిలో సాధువులు కూడా ఉన్నారు. ఇంతకముందు కూడా అలాంటి ఘటనే ఆ ప్రాంతంలో జరిగినట్టు ఇక్కడ చదవొచ్చు. పాల్గర్ పీఆర్ఓ తో FACTLY మాట్లాడగా, ఈ ఘటనలో మతపరమైన కారణాలు ఏమీలేవని తెలిపారు. అంతే కాదు, ఆ ఘటనలో పాల్గొన్న 110 మందిని గుర్తించి అరెస్ట్ చేశామని పాల్గర్ పోలీస్ ట్వీట్ చేసింది. ఈ ఘటనలో మతపరమైన కారణాలు లేవని మహారాష్ట్ర హోమ్ మంత్రి కూడా ట్వీట్ చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://www.indiatoday.in/india/story/3-men-lynched-in-maharashtra-on-suspicion-of-being-robbers-1668027-2020-04-17
2. న్యూస్ ఆర్టికల్ – https://www.theweek.in/news/india/2020/04/17/maharashtra-villagers-lynch-3-people-in-palghar-on-suspcion-of-being-thieves.html
3. న్యూస్ వీడియో – https://www.youtube.com/watch?v=mO2lUpmiIFI
4. ANI ట్వీట్ – https://twitter.com/ANI/status/1251342347180228610
5. పాల్గర్ పోలీస్ ట్వీట్ : https://twitter.com/Palghar_Police/status/1251943563752955904
6. మహారాష్ట్ర హోమ్ మంత్రి ట్వీట్: https://twitter.com/AnilDeshmukhNCP/status/1251932197713588225

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?