ఈ పాకిస్తాన్ వీడియోలో వ్యక్తులు మొక్కలు పీకేసింది వివాదాస్పద భూమిలో నాటినందుకు, ఇస్లాంకి విరుద్ధం అని కాదు

కొందరు వ్యక్తులు మొక్కలను పీకేస్తున్న వీడియోను చూపిస్తూ, మొక్కలు నాటడం ఇస్లాంకి విరుద్దం కాబట్టి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాటిన మొక్కలు పీకేస్తున్నారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మొక్కలు నాటడం ఇస్లాంకి విరుద్దం కాబట్టి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాటిన మొక్కలు పీకేస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): వివిధ వార్తా పత్రికల కథనాల ప్రకారం ఈ ఘటన పాకిస్తాన్ లోని ఖైబర్ ఏజెన్సీలో జరిగింది. ఐతే ఈ కథనాల ప్రకారం ఒక వివాదాస్పద భూమిలో మొక్కలు నాటిన కారణంగా కొందరు వ్యక్తులు వాటిని పీకేసారు. ఐతే ఏ యొక్క వార్తా కథనం కూడా ఈ ఘటనని మత విశ్వాసానికి ఆపాదించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

‘Pakistan saplings uprooting’ అనే కీ వర్డ్స్ తో గూగుల్ లో వెతకగా ఈ వార్తని ప్రచురించిన ఒక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఘటన పాకిస్తాన్ లోని ఖైబర్ ఏజెన్సీ లోని మండి కాస్ ఏరియాలో జరిగింది. టైగర్ ఫోర్సు డే జ్ఞాపకార్ధం 1000 కోట్ల మొక్కలు నాటాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన పిలుపు మేరకు చట్టసభ సభ్యడైన ఇక్బాల్ అఫ్రిది నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో జరిగిన ఘటన ఇది. వివాదాస్పద భూమిలో మొక్కలు నాటిన కారణంగా వాటిని పీకేసారు అని ఈ కథనంలో పేర్కొన్నారు.

ఐతే రెండు వర్గాల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూమిలో మొక్కలు నాటడానికి ఒక వర్గం అనుమతి ఇస్తే మరో వర్గం వారు నాటిన మొక్కలని పీకేసారు అని డిప్యూటీ కమిషనర్ తెలిపినట్టుగా ఈ వార్తా  కథనంలో రాసారు. ఈ ఘటనని ప్రచురించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. ఐతే ఏ యొక్క వార్తా కథనం కూడా ఈ ఘటనని మత విశ్వాసానికి ఆపాదించలేదు.

.చివరగా, వివాదాస్పద భూమిలో మొక్కలు నాటిన కారణంగా వాటిని పీకేసారే తప్ప ఈ ఘటనకి మత విశ్వాసానికి ఎటువంటి సంబంధం లేదు.

Did you watch our new video?