Fake News, Telugu
 

ఈ వీడియోలో NRC కి మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న వారిని కేరళ ప్రజలు తరిమి కొట్టలేదు

0

కేరళలో (NRC)ఎంఆర్సి కి మద్దతుగా ర్యాలీ కొందరు చేపట్టారు. కేరళ ప్రజలు వారిని ఊరంతా తరిమారు. భయంతో వారు పరుగులు తీశారు’ అని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలో NRC కి మద్దత్తుగా ర్యాలీ నిర్వహిస్తున్న వారిని ప్రజలు తరిమికొడుతున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): పోస్ట్ చేసిన వీడియో జూన్-2019 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు చూడవొచ్చు. వీడియోలోని ర్యాలీ NRC లేదా CAA కి సంబంధించింది కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని జూన్-2019 లోనే ఒక వ్యక్తి యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం ఇంటర్నెట్ లో దొరకలేదు. కానీ, CAA మరియు NRC కి మద్దతుగా లేదా నిరసనగా ర్యాలీలు నిర్వహించడం డిసెంబర్-2019 లో మొదలయ్యాయి. పోస్ట్ చేసిన వీడియో జూన్-2019 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్టు చూడవొచ్చు. కావున, వీడియోలోని ర్యాలీ NRC లేదా CAA కి సంబంధించింది కాదు.

చివరగా, పాత వీడియో పెట్టి, ‘NRC కి మద్దతుగా ర్యాలీ నిర్వహిస్తున్న వారిని కేరళ ప్రజలు తరిమికొడుతున్న వీడియో’ అని షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll