సంబంధం లేని పాత వీడియో ని పోస్టు చేసి, ‘చైనా దొంగ దెబ్బకు బలైన సైనికుల రోదనలు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘చైనా దొంగ దెబ్బకు బలైన సైనికుల రోదనలు’ అని  దాని గురించి చెప్తున్నారు. ఆ వీడియోని ప్రస్తుతం భారత్ మరియు చైనా మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల సమయంలో షేర్ చేస్తున్నారు. భారత్ మరియు చైనా సైన్యాల మధ్య 15 జూన్ 2020న గాల్వాన్ వ్యాలీ లో జరిగిన ఘర్షణల్లో సుమారు ఇరవై మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోస్టు లోని వీడియో పాతదని FACTLY విశ్లేషణ లో తెలిసింది. ఆ వీడియో కనీసం 7 నవంబర్ 2019 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్లుగా తెలిసింది. ఆ వీడియో ఏ సందర్భంలో తీశారో కచ్చితంగా చెప్పలేము, కాకపోతే ఒక నాటకం లో భాగంగా తీసినట్టు అర్థం అవుతుంది. ప్రస్తుతం భారత్ మరియు చైనా మధ్య జరుగుతున్న ఘర్షణలకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని చెప్పవచ్చు. 

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. పాత వీడియో – https://www.youtube.com/watch?v=WbZMQ1DtEZ4

Did you watch our new video?