పాత వీడియోని రైతు నిరసనలకు మద్దతుగా 2000 గుర్రాలపై 20000 నిహాంగ్ సిక్కులు ఢిల్లీకి బయలుదేరారని తప్పుగా షేర్ చేస్తున్నారు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న  అందోళనలకు మద్దతుగా 2000 గుర్రాలపై 20000 మంది నిహాంగ్ సిక్కులు ఢిల్లీకి బయలుదేరారు అని చెప్తూ దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైతు నిరసనలకు మద్దతుగా 2,000 గుర్రాలపై 20,000 నిహాంగ్ సిక్కులు ఢిల్లీకి బయలుదేరారు.

ఫాక్ట్ (నిజం): ఇది పాత వీడియో, ఈ వీడియో 2018 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2018లో యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడ్డ ఇలాంటి వీడియో ఒకటి మాకు కనిపించింది. దీన్నిబట్టి ఈ వీడియో పాతదని చెప్పొచ్చు.

‘Delhi Fateh Diwas 2018’ కి సంబంధించిన వీడియో అని చెప్తూ ఇదే వీడియోని షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి. ‘Delhi Fateh Diwas 2018’ కి సంబంధించిన వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోకి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ, ఈ వీడియో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న డేట్ ప్రకారం ఈ వీడియోకి ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధంలేదని చెప్పొచ్చు. ఎందుకనగా కొత్త వ్యవసాయ చట్టాలు పార్లమెంట్ లో ఆమోదం పొందక ముందు నుండే  ఈ వీడియో ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 

చివరగా, పాత ఊరేగింపు కి సంబంధించిన వీడియోని రైతు నిరసనలకు మద్దతుగా 2000 గుర్రాలపై 20000 మంది నిహాంగ్ సిక్కులు ఢిల్లీకి బయలుదేరారని తప్పుగా షేర్ చేస్తున్నారు.